E-Paper
Advertisement

Mohammad Amir: హెట్‌మెయర్ అస‌లు ఔటే కాదు..మ్యాచ్ మొత్తం ఫిక్సింగే, పాకిస్తాన్ బౌల‌ర్ ఆరోప‌ణ‌లు

Mohammad Amir: హెట్‌మెయర్ అస‌లు ఔటే కాదు..మ్యాచ్ మొత్తం ఫిక్సింగే, పాకిస్తాన్ బౌల‌ర్ ఆరోప‌ణ‌లు
Advertisement

Mohammad Amir :  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో సెమీ ఫైనల్ కు టీమిండియా చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియా పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే జరిగిందని ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు… ఇప్పుడు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies ) మ్యాచ్ ఉద్దేశించి కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్ పై మహమ్మద్ అమీర్ (Mohammad Amir ) మాట్లాడుతూ… వెస్టిండీస్ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మెయర్ ( Shimron Hetmyer) అసలు ఔట్ కాలేదని.. అంపైర్లు అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు. బ్యాట్ కు బంతి తగలకపోయినా, ఔట్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీంతో మ్యాచ్ మొత్తం టీమిండియా చేతిలోకి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిక్సింగ్ ( Match Fixing) జరగడం వల్లే, టీమిండియా నిన్న గెలిచిందని వింత వాదన తెరపైకి తీసుకువచ్చారు మహమ్మద్ అమీర్.

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

హెట్‌మెయర్ అస‌లు ఔటే కాదు..మ్యాచ్ మొత్తం ఫిక్సింగే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్ అర్హత సంపాదించింది ఇండియా. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మెయర్ ( controversial Hetmyer dismissal ) ఔట్ కావడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అది నాటౌట్ అని.. అంపైర్లు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఈ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. బుమ్రా వేసిన ఓ అద్భుతమైన బంతికి వికెట్ కీపర్ సంజు శాంసన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు షిమ్రోన్‌ హెట్‌మెయర్‌.

అయితే ఆల్ట్రా ఎడ్జ్ లో ఆ బంతి బ్యాట్ కు కాస్త తగిలినట్లు కనిపించింది. దీంతో ఔట్ ఇచ్చారు. అయితే వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ అది నాటౌట్ అని మొత్తుకున్నాడు. ఇదే వివాదం పైన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిమ్రోన్‌ హెట్‌మెయర్ ఔట్ కాలేదని వెల్లడించారు. ప్యాంటుకు తగిలిన బంతిని బ్యాట్ కు తగిలినట్లు అల్ట్రా ఎడ్జ్ చూపించారని బాంబు పేల్చారు. అంపైర్లను బీసీసీఐ కొనుగోలు చేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని నిప్పులు చెరిగారు. షిమ్రోన్‌ హెట్‌మెయర్ ( controversial Hetmyer dismissal ) ఔట్ కాకపోయి ఉంటే టీమిండియా ఓడిపోయేదని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు మహమ్మద్ అమీర్.

Advertisement

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

 

 

 

 

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×