E-Paper
Advertisement

Supernatural comedy Movie OTT: వాక్యూమ్ క్లీనర్ లో ఆత్మ… చచ్చినా వదలని భార్య

Supernatural comedy Movie OTT: వాక్యూమ్ క్లీనర్ లో ఆత్మ… చచ్చినా వదలని భార్య
Advertisement

Supernatural comedy Movie OTT : థాయ్‌లాండ్‌కు చెందిన ఒక సూపర్‌నేచురల్ సిననిమా బ్లాక్ కామెడీతో ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కేవలం కామెడీ మాత్రమే కాదు, థాయ్‌లాండ్ రాజకీయాలు, పర్యావరణ కాలుష్యం అంశాలను సెటైరికల్ గా చూపిస్తుంది. చనిపోయిన తర్వాత భర్తను వదిలి వెళ్లలేక, వాక్యూమ్ క్లీనర్ లోకి ప్రవేశించిన ఒక ఆత్మ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ సూపర్‌నేచురల్ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘ఎ యూజ్‌ఫుల్ గోస్ట్’ (A Useful Ghost). రాట్చపూమ్ బూన్‌బుంచచోక్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో ప్రముఖ థాయ్ నటి దవికా హూర్నే ప్రధాన పాత్ర పోషించాగా, విత్సారుట్ హిమ్మరత్, అపసిరి నితిభోన్, వాన్‌లాప్ రుంగ్‌కుమ్జాద్, విసారత్ హోమ్‌హువాన్ మిగతా ముఖ్య పాత్రల్లో నటించారు. 2025 కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ‘గ్రాండ్ ప్రిక్స్’ అవార్డును గెలుచుకుని అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో Prime Video) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నట్ అనే యువతి కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోతుంది. కానీ తన భర్త మార్చ్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ. అందుకే చనిపోయినా అతడిని వదిలి వెళ్లలేక, వాళ్ల ఇంట్లో ఉండే ఒక వాక్యూమ్ క్లీనర్‌లోకి ఆత్మగా చేరుతుంది. భార్య తిరిగి రావడంతో మార్చ్ సంతోషపడతాడు కానీ, ఆ ఇంట్లోని మిగతా వాళ్ళకి మాత్రం, ఒక ఆత్మ వ్యాక్యూమ్ క్లీనర్‌ రూపంలో తిరగడం అస్సలు నచ్చదు. ముఖ్యంగా ఆమె అత్తగారు, ఈ ఆత్మ వల్ల తమకు ఏదో కీడు జరుగుతుందని భయపడి ఆమెను ఇంట్లోంచి పంపించేయాలని చూస్తుంటారు.

తన వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని, తను చాలా మంచి ఆత్మనని నిరూపించుకోవడానికి నట్ ఒక వింత పని మొదలుపెడుతుంది. తన వాక్యూమ్ క్లీనర్ శక్తులతో కేవలం దుమ్మునే కాకుండా, మరో పనిని కూడా మొదలు పెడుతుంది. ఆ పని ఏమిటి ? ఈ ఆత్మ అత్తగారిని మెప్పిస్తుందా ? ఈ క్లైమాక్స్ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ సూపర్‌నేచురల్ బ్లాక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు, థియేటర్లలో అడుగు పెట్టనున్న కన్నడ సినిమాలు

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×