E-Paper
Advertisement

వాంపైర్ బ్రదర్స్ క్రేజీ లవ్ వార్… 8 సీజన్లు 171 ఎపిసోడ్లతో పిచ్చెక్కిస్తున్న సిరీస్

వాంపైర్ బ్రదర్స్ క్రేజీ లవ్ వార్… 8 సీజన్లు 171 ఎపిసోడ్లతో పిచ్చెక్కిస్తున్న సిరీస్
Advertisement

Supernatural Horror Series on OTT : లవ్, హారర్, సస్పెన్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ కలిసిన ఒక పవర్‌ఫుల్ సూపర్ నేచురల్ టీన్ డ్రామా సిరీస్ ఓటీటీలో సందడి చేసింది. ఇది మామూలు కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగే లవ్, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్‌తో స్టార్ట్ అయి.. ఆ తర్వాత మంత్రగత్తెలు, రక్తపిశాచులు మధ్య జరిగే పగలు, ప్రతీకారాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఇద్దరు వాంపైర్ అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఆమెను కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే సాహసాలు, వాళ్ళ మధ్య నడిచే లవ్ ట్రయాంగిల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ప్రతి ఎపిసోడ్ ఎండ్‌లో ఊహించని రేంజ్‌లో సస్పెన్స్ ట్విస్టులు ఉంటాయి. దీనివల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు కంటిన్యూగా చూసేలా చేస్తుంది. యాక్షన్ సీన్స్, రక్తం తాగే హారర్ ఎలిమెంట్స్, గుండెను పిండేసే ఎమోషన్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న ఈ సిరీస్.. ఫాంటసీ థ్రిల్లర్ కథలను ఇష్టపడే వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

ఎక్కడ చూడచ్చుఅంటే

‘ది వాంపైర్ డైరీస్’ (The Vampire Diaries) ఎల్. జె. స్మిత్ రాసిన ప్రసిద్ధ నవలల ఆధారంగా రూపొందింన ఒక అమెరికన్ సూపర్ నేచురల్ టీన్ డ్రామా టెలివిజన్ సిరీస్. ఈ సిరీస్ 2009 నుండి 2017 వరకు ది సిడబ్ల్యు (The CW) ఛానల్‌లో 8 సీజన్లలో మొత్తం 171 ఎపిసోడ్లతో ప్రసారమై, ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రజాదరణ పొందింది. నినా డోబ్రెవ్, పాల్ వెస్లీ, ఇయాన్ సోమర్‌హాల్డర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ విజయవంతం కావడంతో, దీనికి కొనసాగింపుగా ‘ది ఒరిజినల్స్’ (The Originals), ‘లెగసీస్’ (Legacies) అనే రెండు సూపర్ హిట్ స్పిన్-ఆఫ్ సిరీస్‌లు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ పూర్తి సిరీస్ భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ ఓటిటి ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా ‘మిస్టిక్ ఫాల్స్’ అనే ఒక వింతైన ఊరి చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద యాక్సిడెంట్‌లో పేరెంట్స్‌ను కోల్పోయి బాధపడుతున్న ఎలెనా గిల్బర్ట్ అనే కాలేజ్ అమ్మాయి లైఫ్‌లోకి స్టెఫాన్, డేమన్ అనే ఇద్దరు వాంపైర్ అన్నదమ్ములు ఎంట్రీ ఇస్తారు. స్టెఫాన్ చాలా మంచివాడు, ఎలెనాను ప్రాణంగా ప్రేమిస్తాడు, అయితే అతని అన్న డేమన్ మాత్రం చాలా డేంజర్, రఫ్ అండ్ స్మార్ట్. ఎలెనా మొదట స్టెఫాన్‌ను లవ్ చేసినా, ఆ తర్వాత డేమన్‌కు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ ముగ్గురి మధ్య నడిచే లవ్ స్టోరీ, లవ్ ట్రయాంగిల్ ఈ సిరీస్‌కు మెయిన్ హైలైట్.

అయితే ఇది నార్మల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, కథ ముందుకు వెళ్లేకొద్దీ ఆ ఊరిలో ఉండే మంత్రగత్తెలు, తోడేలుగా మారే మనుషులు, ఇంకా ప్రపంచంలోనే ఫస్ట్ పుట్టిన డేంజరస్ వాంపైర్స్ అందరూ ఎలెనా వెనుక పడతారు. ఎందుకంటే ఎలెనాకు ఒక వింతైన గతం ఉంటుంది, ఆమె రక్తం అందరికీ చాలా పవర్‌ఫుల్. ఎలెనా, ఆ బ్రదర్స్ తో కలిసి విలన్ల నుండి ఎలా తప్పించుకుంది ? ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ? అనేదే 8 సీజన్ల ఇంట్రెస్టింగ్ స్టోరీ.

Advertisement

Read Also : వైట్ హౌస్ లో జరిగిన హై ప్రొఫైల్ హత్య.. 157 మంది అనుమానితులతో కేసును ఛేదించే లేడీ డిటెక్టివ్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×