E-Paper
Advertisement

వైట్ హౌస్ లో జరిగిన హై ప్రొఫైల్ హత్య.. 157 మంది అనుమానితులతో కేసును ఛేదించే లేడీ డిటెక్టివ్

వైట్ హౌస్ లో జరిగిన హై ప్రొఫైల్ హత్య.. 157 మంది అనుమానితులతో కేసును ఛేదించే లేడీ డిటెక్టివ్
Advertisement

Crime Comedy Series on OTT : ఒక మర్డర్ మిస్టరీని ఓటీటీలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. మామూలుగా మర్డర్ మిస్టరీ స్టోరీలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతాయి. అయితే ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మాత్రం నవ్వులు పోయిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత ఉండే అమెరికా వైట్ హౌస్‌లో జరిగే ఒక మర్డర్ మిస్టరీ కథ. అక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు విందు జరుగుతున్న సమయంలో ఒక ముఖ్య అధికారి హత్యకు గురవుతాడు. దాంతో వైట్ హౌస్ మొత్తాన్ని లాక్‌డౌన్ చేస్తారు. ఈ కేసును ఒక తెలివైన లేడీ డీల్ చేస్తుంది. చివరికి అసలు హంతకుడిని ఎలా పట్టుకుందనేదే ఈ సిరీస్ కథ. సీరియస్ క్రైమ్ స్టోరీకి మంచి కామెడీని జోడించి, టైమ్‌పాస్ అయ్యేలా దీనిని రూపొందించారు. వీకెండ్ లో ఓ సారి ట్రై చేస్తే మజా గ్యారెంటీ.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ మిస్టరీ కామెడీ మినీ సిరీస్ పేరు ‘ది రెసిడెన్స్’ (The Residence). ఇది 2025 మార్చి 20న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ షోండాలాండ్ నిర్మించిన ఈ 8 ఎపిసోడ్‌ల థ్రిల్లర్, ప్రస్తుతం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. కేట్ అండర్సన్ బ్రోవర్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌కు ఐయండిబిలో 7.7/10 రేటింగ్ లభించింది. ఇందులో ఉజో అడుబా లీడ్ రోల్ లో నటించగా, రాండాల్ పార్క్, జియాన్‌కార్లో ఎస్పోసిటో, సుసాన్ కెలెచి వాట్సన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ స్టోరీ అంతా వైట్ హౌస్ చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రెసిడెంట్ ఒక పెద్ద పార్టీ ఇస్తారు. అందరూ ఎంజాయ్ చేస్తున్న టైమ్‌లో, వైట్ హౌస్ మెయిన్ మేనేజర్ బిల్డింగ్ మూడో అంతస్తులో మర్డర్ అయి కనిపిస్తాడు. దాంతో ఒక్కసారిగా వైట్ హౌస్ అంతా షాక్ అవుతుంది. ఈ పెద్ద కేసును సాల్వ్ చేయడానికి కార్డెలియా కప్ అనే ఒక విచిత్రమైన, తెలివైన లేడీ డిటెక్టివ్‌ని పిలిపిస్తారు. ఆమె రాగానే వైట్ హౌస్ మొత్తాన్ని లాక్‌డౌన్ చేసి, లోపల ఉన్న 157 మందిని (రాజకీయ నాయకులు, విఐపిలు, వంటవాళ్లు) సస్పెక్ట్స్‌గా మార్చేస్తుంది.

ఇక అక్కడి నుంచి డిటెక్టివ్ కప్ తన అసిస్టెంట్, అలాగే ఎఫ్‌బీఐ ఏజెంట్ పార్క్‌తో కలిసి ఒక్కొక్కరిని ఇంటరాగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌లో ప్రెసిడెంట్ ఫ్యామిలీ సీక్రెట్స్, వైట్ హౌస్ కిచెన్ పాలిటిక్స్, పెద్దల గుట్టు అన్నీ బయటపడతాయి. పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైనా సరే, కప్ అస్సలు తగ్గకుండా తన స్టైల్‌లో కామెడీగా, సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చివరికి ఆ 132 గదుల వైట్ హౌస్‌లో దాక్కున్న అసలు హంతకుడిని ఆమె ఎలా పట్టుకుందనేదే ఈ వెబ్ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : రష్యాలో ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్‌… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×