Survival Drama OTT : సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తాయి. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్ రావు సింగిల్ హ్యాండెడ్‌గా నటించిన ఒక మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది ఒక యువకుడు బిల్డింగ్‌లో లాక్ అయిపోయి బతకడానికి పోరాడే స్టోరీ. ఈ సినిమా ఎక్కడా బిగ్ బడ్జెట్ లేకుండా, సింగిల్ లొకేషన్‌లో తీసిన ఇంటెన్స్ సర్వైవల్ డ్రామా. రాజ్‌కుమార్ రావు పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ పేరు, స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
2016లో విడుదలైన ‘ట్రాప్డ్’ (Trapped) సినిమా ఒక ఉత్కంఠభరితమైన సర్వైవల్ థ్రిల్లర్. దీనికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. ఫాంటమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనురాగ్ కశ్యప్, వికాస్ బహల్, మధు మంతెన కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు కాల్ సెంటర్ ఉద్యోగిగా నటించారు. గీతాంజలి థాపా అతని స్నేహితురాలుగా నటించారు. సినిమా మొత్తం రాజ్‌కుమార్ రావు చుట్టూనే తిరుగుతుంది. ఆయన నటనకు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. రాజ్‌కుమార్ రావుకు ఈ సినిమాలోని నటనకు గానూ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. విక్రమాదిత్య మోత్వానే ఈ సినిమాను కేవలం 20 రోజుల్లో చిత్రీకరించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా zee5, prime videoలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : థియేటర్లలో సంచలనం సృష్టించిన మలయాళం హారర్ ఫాంటసీ మూవీ ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు ?
శౌర్య (రాజ్‌కుమార్ రావు) ముంబైలో ఒక సాధారణ కాల్ సెంటర్ ఉద్యోగి. అతను తన ప్రియురాలు నూరి (గీతాంజలి థాపా)ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమెకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. పెళ్లి తర్వాత కలిసి ఉండటానికి శౌర్య తక్కువ ధరలో వచ్చే ఒక ఇంటి కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో ముంబైలోని ఒక నిర్మానుష్యమైన 35 అంతస్తుల భవనంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంటాడు. ఆ భవనంలో అతను తప్ప మరెవరూ ఉండరు, కేవలం ఒక వాచ్‌మన్ మాత్రమే ఉంటాడు.
ఒక రోజు ఉదయం శౌర్య తన ఫ్లాట్ నుండి బయటకు వెళ్లే సమయంలో, తాళం చెవులు బయటే మరిచిపోయి తలుపు వేస్తాడు. తలుపు లాక్ అయిపోతుంది. దురదృష్టవశాత్తూ ఆ ఫ్లాట్‌కు నీటి సరఫరా గానీ, విద్యుత్ గానీ ఉండదు. అతని ఫోన్‌లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. దీంతో అతను పూర్తిగా ఫ్లాట్ లో బందీ అయిపోతాడు. చివరికి అతను అక్కడినుంచి బయట పడతాడా ? అతని ప్రేమ కథ ఏమవుతుంది ? అనే విషయాలను మాత్రం ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.