E-Paper
Advertisement

Jyothi Yarraji: కిరాణ స‌మాను అమ్ముకుంటూ, గోల్డ్ మెడ‌ల్ స్థాయికి..జ్యోతి యర్రాజీ కన్నీటి గాథ

Jyothi Yarraji: కిరాణ స‌మాను అమ్ముకుంటూ, గోల్డ్ మెడ‌ల్ స్థాయికి..జ్యోతి యర్రాజీ కన్నీటి గాథ
Advertisement

Jyothi Yarraji: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ ( Jyothi Yarraji ) గురించి తెలియని వారు ఉండరు. ఇటీవలే గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన జ్యోతి, తన టాలెంట్ రుజువు చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగింది. మొన్న ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ లో ఆమె పాల్గొంది. ఈ పోటీల్లో వరసగా రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది జ్యోతి యర్రాజీ . 2025 చివరలో దక్షిణ కొరియా లోని గుమిలో ఛాంపియన్షిప్ జరిగింది. ఈ టోర్నమెంట్లో 12.96 సెకండ్లలో 100 మీటర్ల హర్డిల్స్ లో విజయం సాధించింది. దీంతో జ్యోతి కి గోల్డ్ మెడల్ కూడా దక్కింది. అలాగే 2023లో థాయిలాండ్ లో కూడా 100 మీటర్ల హర్డిల్స్ లో అదరగొట్టిన ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీ, ఆ సమయంలో కూడా స్వర్ణ పథకాన్ని అందుకోవడం జరిగింది. ఇలా తన కెరీర్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో మూడు గోల్డ్ మెడల్స్ సంపాదించింది. అంతేకాదు 200 మీటర్ల పరుగు పందెంలో కూడా ఒకసారి స్వర్ణ పతకం తెచ్చుకుంది జ్యోతి యర్రాజీ.

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

మిడిల్ క్లాస్ నుంచి జాతీయస్థాయికి

Advertisement

వరుసగా గోల్డ్ మెడల్స్ సాధిస్తున్న జ్యోతి పర్సనల్ లైఫ్ చాలా అధ్వానంగా ఉంది. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన జ్యోతి ఫ్యామిలీ మిడిల్ క్లాస్. ప్రతిరోజు పని పనిచేసే ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఒక్కరోజు పని చేయకపోయినా, తెల్లారి పస్తులు ఉండాల్సిందే. తన తండ్రి సూర్యనారాయణ. ఆయన ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. అతనికి జీతం 6000 వరకు మాత్రమే వస్తుందట. ఇక తల్లి కుమారి. హౌస్ వైఫ్. అంతేకాదు ఓ ఆసుపత్రిలో పార్ట్ టైం గా హౌస్ కీపింగ్ చేస్తుందని సమాచారం. ఆమెకు కూడా 6000 రూపాయల వరకు జీతం వస్తుందట. అయినప్పటికీ తన కూతురిని ఉన్నత స్థానానికి పంపించాలన్న కసితో కుమారి, జ్యోతి కి భరోసాను ఇచ్చింది.

కిరాణా సామాను అమ్ముకుంటూ గోల్డ్ మెడల్ స్థాయికి జ్యోతి యర్రాజీ ( Jyothi Yarraji )

తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు కుటుంబ పోష‌న‌కే సరిపోయేది. జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలంటే, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ జ్యోతి యర్రాజీ తగ్గలేదు. కిరాణా సామాను హోల్ సేల్ ధరకు తెచ్చుకుని, ఇంటింటికి ఒక రూపాయి లేదా రెండు రూపాయల లాభానికి సప్లై చేసేది. సబ్బు నుంచి చిన్నపిల్లల డైపర్ల వరకు, ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్లి అమ్మేది. అలా రోజుకు 30 రూపాయలు సంపాదించిందట జ్యోతి. ఆ డబ్బులతో ఎనర్జీ కోసం ఫుడ్ కొనుగోలు చేసి, తినేది. అలాంటి సమయంలో ఏపీలో రిలయన్స్ కు చెందిన ఒక కార్యక్రమం నిర్వహించారట. ఆ కార్యక్రమం ద్వారా అథ్లెట్ గా మారింది జ్యోతి. ఇక గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత జ్యోతిని పర్సనల్ గా పిలిపించి ఆదుకున్నారు నారా లోకేష్. 30 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది.

Advertisement

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×