E-Paper
Advertisement

Survival Thriller ott : డెడ్లీ డెత్ గేమ్ లో ఆర్డినరీ అమ్మాయి అరాచకం… కూటి కోసం కోటి తిప్పలు… మైండ్ బెండింగ్ యానిమే సిరీస్

Survival Thriller ott : డెడ్లీ డెత్ గేమ్ లో ఆర్డినరీ అమ్మాయి అరాచకం… కూటి కోసం కోటి తిప్పలు… మైండ్ బెండింగ్ యానిమే సిరీస్
Advertisement

Survival Thriller ott : ఇటీవల కాలంలో యానిమేలకు కూడా ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇది వరకైతే చిన్న పిల్లల్లా ఆ బొమ్మలు ఎవరు చూస్తారు ? అనేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ముఖ్యంగా జపనీస్ యానిమేలను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సిరీస్ లు చిన్న పిల్లలకే కాదు ప్రత్యేకంగా పెద్దల కోసం కూడా వస్తున్నాయి. ఇప్పుడు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. మరి ఈ యానిమే సిరీస్ పేరు ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న యానిమే పేరు ‘షిబోయుగి: డెత్ గేమ్స్ టు పుట్ ఫుడ్ ఆన్ ది టేబుల్’ (SHIBOYUGI: Playing Death Games to Put Food on the Table). 2026లో ఫ్రెష్ గా వచ్చిన ఈ జపనీస్ యానిమే సిరీస్ యూషి ఉకై రచించిన లైట్ నవల ఆధారంగా తెరకెక్కింది. దీన్ని స్టూడియో డీన్ నిర్మించగా, జనవరి 7న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో గ్లోబల్‌ గా స్ట్రీమింగ్ అవుతోంది. డెత్ గేమ్స్ జానర్‌లో రిఫ్రెషింగ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్ సూజీ యుంగ్ (యూకి సోరిమాచి) 17 ఏళ్ల ప్రొఫెషనల్ డెత్ గేమ్ ప్లేయర్. బ్రియాన్నా నికర్‌బాకర్, కైలి మిల్స్, డాన్ ఎం. బెన్నెట్ వంటి నటీనటులు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సోతా ఉయెనో డైరెక్ట్ చేసిన ఈ యానిమే ఒక రకంగా చెప్పాలంటే ‘స్క్విడ్ గేమ్’ టైపులో ఉంటుంది. ఒకవేళ మీకు గనుక ఆ సిరీస్ నచ్చితే, ఈ యానిమే సిరీస్ కూడా పర్ఫెక్ట్ ఛాయిస్. కాబట్టి ఈ వీకెండ్ ఈ సిరీస్ ను డోంట్ మిస్.

Advertisement

Read Also : 200 మందిని బలి తీసుకున్న సైకో… సైన్స్ పాఠాలు నేర్పిస్తానని… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

స్టోరీలోకి వెళ్తే…

అండర్‌గ్రౌండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో జరిగే డెత్ గేమ్స్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. యూకి సోరిమాచి అనే 17 ఏళ్ల అమ్మాయి ఇందులో హీరోయిన్. ఆమె ఆర్డినరీ అమ్మాయే. కానీ ఒక ప్రొఫెషనల్ డెత్ గేమ్ ప్లేయర్. కూటి కోసం కోటి కష్టాలు అన్నట్టు… ఆమెకు ఇదే జీవనోపాధి. ఇక ఆ అమ్మాయి కేవలం గేమ్స్ లో పార్టీసిపేట్ చేయడమే కాదు, గెలుస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఓ రోజు ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి తనకే తెలియని మాన్షన్‌లో మేకప్ యూనిఫాం ధరించి ఉంటుంది. అక్కడ అచ్చం తనలాగే మరో 5 మంది గర్ల్స్ అమ్మాయిలు కూడా ఉంటారు. అందరూ సేమ్ డ్రెస్‌ లో ఉంటారు. దీంతో ఇది “ఘోస్ట్ హౌస్” అని హీరోయిన్ కి అర్థం అవుతుంది. ఈ డెడ్లీ గేమ్స్‌ ను గెలిస్తేనే ప్రాణాలతో బయట పడతారు. యూకి ఎలాగూ ఇలాంటి గేమ్స్ లో ఆరితెరయిందే కాబట్టి అక్కడున్న అందరి కంటే కూల్‌ గా ఉంటుంది. ఆమెకు గేమ్స్ రూల్స్ మాత్రమే కాదు స్ట్రాటజీలు కూడా బాగా తెలుసు. ఇక ఈ గేమ్స్ మొత్తం టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ గా ప్రసారం అవుతాయి. అంతేకాదు ఆడియెన్స్ బెట్టింగ్ కూడా వేస్తారు. ఇంతకీ హీరోయిన్ ఇందులో ఎలా సర్వైవ్ అయ్యిందో తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×