E-Paper
Advertisement

Hyderabad: తాను డాక్టర్ కాదు.. కానీ సోషల్ డాక్టర్‌, అలాగైతే కెరీర్ ఎండ్- సీఎం రేవంత్‌రెడ్డి

Hyderabad:  తాను డాక్టర్ కాదు.. కానీ సోషల్ డాక్టర్‌, అలాగైతే కెరీర్ ఎండ్- సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Hyderabad: తాను డాక్టర్‌ని కాదని, కానీ సోషల్ డాక్టర్ అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని అన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లేనని మనసులోని మాట బయటపెట్టారు. తాను వృత్తి పరంగా డాక్టర్ కానప్పటికీ, నిర్వహిస్తున్న పదవీ బాధ్యతల పరంగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ HICCలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్

Advertisement

శనివారం హైదరాబాద్ HICCలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 500 మంది కార్డియాలజిస్టులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది.  లేటెస్ట్ టెక్నాలజీ అప్ గ్రేడ్ చేసుకోవాలని, అదే సమయంలో ప్రజల నాడి పట్టుకోవడం మరిచిపోవద్దన్నారు.

విజ్ఞానం, సాంకేతికతిక పరంగా ప్రపంచంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

తాను డాక్టర్ కాదు.. కానీ సోషల్ డాక్టర్‌- సీఎం రేవంత్‌రెడ్డి

ఈ మధ్యకాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని, గుండె జబ్బులను నివారించే మిషన్‌లో మనమందరం భాగస్వాములు కావాలన్నారు. ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్-ICRTF ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్‌లో ఈ కాన్ఫరెన్స్ జరగడం ఎంతో గర్వకారణమని అన్నారు.

లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి అనుబంధ రంగాల ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, ఈ విషయంలో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని వెల్లడించారు.

ALSO READ: కోమటిరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఖబడ్దార్ -జగ్గారెడ్డి నిప్పులు

ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరించాలన్నారు. కార్డియాలజిస్టులు స్పచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు సీపీఆర్ చేయడంలో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. దానివల్ల దేశంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతామని అభిప్రాయపడ్డారు. వైద్యులు మనుషులతో మమేకమయ్యే సమయంలో మానవీయ స్పర్శను కోల్పోవద్దన్నారు. వైద్యుల విషయంలో హైటెక్, హైటచ్ రెండూ కలిసి నడవాలన్నారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

వైద్యులు మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను ఎప్పుడూ మర్చిపోకూడదన్నారు సీఎం. ప్రభుత్వ పరంగా ఆరోగ్య సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ విధానాలను మెరుగుపరచేందుకు అలాంటి వైద్యులతో కలిసి పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు.

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×