E-Paper
Advertisement

కనిపించని కూతురి కోసం తండ్రి ఆవేదన… రేవ్ పార్టీల నేపథ్యంతో రూపొందిన సరికొత్త డ్రామా

కనిపించని కూతురి కోసం తండ్రి ఆవేదన… రేవ్ పార్టీల నేపథ్యంతో రూపొందిన సరికొత్త డ్రామా
Advertisement

Survival thriller movie on OTT : దూర ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్ గా మన ఫ్యామిలీలో నుంచి ఎవరైనా కన్పించకుండాపోతే ఎలా ఉంటుంది ? నడిరోడ్డుపై ఆ కుటుంబం ఆవేదనను ఎవరు పట్టించుకుంటారు ? అలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఏం చేస్తారు ? ఇలాంటి కథతో రూపొందిన మూవీ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు Sirāt (2025). ప్రముఖ ఫ్రెంచ్-స్పానిష్ దర్శకుడు ఓలీవర్ లాక్స్ (Óliver Laxe) దర్శకత్వం వహించిన అద్భుతమైన రోడ్ సర్వైవల్ థ్రిల్లర్ . 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో జ్యూరీ ప్రైజ్ గెలుచుకుంది ఈ మూవీ. ఇది కేవలం సర్వైవల్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మనిషిలోని ఆశ, వేదన, కుటుంబ బంధాల వెనుక ఉన్న శక్తిని చూపించే అద్భుతమైన కథ. ఈ సినిమాకు ‘సిరాత్’ అనే పేరును ఇస్లామిక్ పురాణాల నుండి తీసుకుని పెట్టారు. అంటే ‘నరకం – స్వర్గం మధ్య ఉండే వెంట్రుక అంత సన్నని వంతెన’ అని అర్థం. సెర్గి లోపెజ్ తండ్రి పాత్రలో చాలా సహజంగా నటించారు. మావురో హెర్స్ అందించిన సినిమాటోగ్రఫీ ఎడారిలోని శూన్యతను, అందాన్ని అద్భుతంగా బంధించి, ఆడియన్స్ ను సినిమాలో నిమగ్నం అయ్యేలా చేసింది. కాంగ్డింగ్ రే అందించిన టెక్నో మ్యూజిక్ ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణ.

Advertisement

మొరాకో ఎడారుల నేపథ్యంలో ఒక తండ్రి తన కూతురి కోసం వేదనతో చేసే ప్రయాణాన్ని ఇందులో చూడొచ్చు. ఈ చిత్రం 2025 జూన్ 6న స్పెయిన్‌లో, 2025 నవంబర్ 14న అమెరికాలో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

లూయిస్ (సెర్గి లోపెజ్) అనే స్పానిష్ తండ్రి ఇందులో హీరో. చిన్న కొడుకు ఎస్టెబాన్‌ తో కలిసి మొరాకో పర్వత ప్రాంతాల్లోని ఒక ‘రేవ్ పార్టీ’ (టెక్నో మ్యూజిక్ పార్టీ) కి వెళ్తాడు. కొన్ని నెలల క్రితం ఒక మ్యూజిక్ పార్టీలో అదృశ్యమైన తన కూతురు మార్ కోసం వెతికే క్రమంలో ఆయన అక్కడికి వెళ్తాడు. ఆ పార్టీలో ఆమె జాడ దొరకదు. కానీ మారిటానియా సరిహద్దు దగ్గర జరగబోయే మరొక భారీ రేవ్ పార్టీలో ఆమె ఉండవచ్చని తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్తున్న ఒక వింతైన యువకుల బృందంతో (Ravers) కలిసి లూయిస్ ప్రయాణిస్తాడు.

Advertisement

ఎడారిలోని కఠినమైన ఎండ, ఇసుక తుఫానుల మధ్య ఈ ప్రయాణం ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. లూయిస్ తన వెంట ఉన్న ఆ మనుషులను నమ్మవచ్చా లేదా ? అనే సందిగ్ధంలోనే తన జర్నీని కొనసాగిస్తుంటాడు. ఒకవైపు ప్రపంచం యుద్ధం అంచున ఉందనే వార్తలు విన్పిస్తుంటే, మరోవైపు ఈ రేవ్ గ్రూప్ మాత్రం కేవలం సంగీతం, మత్తులోనే మునిగి తేలడం అన్నది ఆయనకు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగిస్తుంది. ఆ ఎడారి వాతావరణం, వింతైన మ్యూజిక్ లూయిస్ తో పాటు అతని కొడుకు ఓపికను ఎలా పరీక్షించాయి ? ఆ తండ్రీ కొడుకులు తమ గమ్యాన్ని చేరుకున్నారా? హీరో తన కూతురిని కనిపెట్టాడా ? అనేదే మిగిలిన కథ.

Read Also : విమానం హైజాకింగ్‌తో మొదలై రక్త పిశాచిగా టర్న్… నెవర్ బిఫోర్ కథ మావా

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×