E-Paper
Advertisement

Zombie Movie OTT : ఊరిని తుడిచిపెట్టే వింత వ్యాధి… లవర్ కోసం జాంబీల ఊచకోత… నెవర్ బిఫోర్ స్టోరీ మావా

Zombie Movie OTT : ఊరిని తుడిచిపెట్టే వింత వ్యాధి… లవర్ కోసం జాంబీల ఊచకోత… నెవర్ బిఫోర్ స్టోరీ మావా
Advertisement

Zombie Movie OTT : జోంబీ సినిమాలంటేనే రక్తపాతం ఏరులై పారుతుంది. ఇలాంటి సినిమాలకు కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. చివరిదాకా కదలకుండా చూస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అత్యంత హింసాత్మక దృశ్యాలతో ఉంటుంది. రక్తం, హింసను చూడలేని వారు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది. ఇందులో చూపించే కొన్ని దృశ్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమాలోని జోంబీలు మనుషుల్లాగే మాట్లాడుతూ, ప్లాన్ వేసి మరీ హింసిస్తారు. అందుకే ఇది చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో విడుదలైన ఈ తైవానీస్ మూవీ ‘ద సాడ్‌నెస్’ (The Sadness) అత్యంత భయంకరమైన, హింసాత్మకమైన బాడీ హారర్ మూవీగా గుర్తింపు పొందింది. రాబ్ జబ్బాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెరాంట్ జు, రెజీనా లీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం హారర్ సినిమాల కోసం ప్రత్యేకమైన Shudder ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది. కొన్ని దేశాల్లో Prime Video లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : చూస్తుండగానే ఆకాశం నుంచి ఊడిపడే మేఘాలు… గుండె జారిపోయే సీన్లు సామీ

కథలోకి వెళ్తే

తైవాన్‌లోని తైపీ నగరంలో ‘ఆల్విన్’ అనే వైరస్ వ్యాపిస్తుంది. మొదట్లో అందరూ ఇది సాధారణ జలుబు వంటిదని నిర్లక్ష్యం చేస్తారు. ప్రభుత్వం కూడా దీనిని పెద్దగా పట్టించుకోదు. కానీ ఆ వైరస్ అకస్మాత్తుగా మనుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ సోకిన వాళ్ళు జోంబీలుగా మారరు. కానీ ఈ వైరస్ సోకిన వ్యక్తి మెదడులోని ‘లింబిక్ సిస్టమ్’ దెబ్బతింటుంది. దీనివల్ల వైరస్ సోకిన వాళ్ళు తమలోని క్రూరమైన ఆలోచనలను నియంత్రించుకోలేరు. వాళ్ళు ఇతరులను చిత్రహింసలు పెట్టడం, చంపడం వంటి పనులు చేస్తారు.

Advertisement

ఇక ఈ కథ జిమ్, కాట్ అనే ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. జిమ్ తన ప్రియురాలు కాట్‌ను రైల్వే స్టేషన్‌లో దించి ఇంటికి వస్తాడు. అప్పుడే నగరంలో వైరస్ ప్రభావం మొదలవుతుంది. వీధిలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపిస్తారు. రైలులో ప్రయాణిస్తున్న కాట్ కూడా ఒక భయంకరమైన దాడిని ఎదుర్కొంటుంది. ఒక ముసలివాడు వైరస్ సోకిన తర్వాత తన వద్ద ఉన్న గొడుగుతో ప్రయాణికులను విచక్షణారహితంగా పొడవడం మొదలుపెడతాడు. రైలు మొత్తం రక్తంతో నిండిపోతుంది. నగరం అంతా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో జిమ్, కాట్ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ ఒక ఆసుపత్రిలో కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు.

జిమ్ దారి పొడవునా నరకప్రాయమైన రక్తపాత దృశ్యాలను చూస్తాడు. కాట్ ఆసుపత్రికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక వైరాలజిస్ట్ ఆమెకు కనిపిస్తాడు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడం అసాధ్యమని, దీనికి ఒకే ఒక పరిష్కారం ‘కన్నీళ్లు’ అని అతను చెప్తాడు. ఎవరికైతే వైరస్ సోకిన తర్వాత కూడా కన్నీళ్లు వస్తాయో, వారి రక్తం ద్వారా చికిత్స చేయవచ్చని వివరిస్తాడు. అయితే జిమ్ ఆసుపత్రికి చేరుకునేసరికి అతనికి కూడా వైరస్ సోకుతుంది. అతను ఇప్పుడు అతను కాట్‌ను హింసించాలని అనుకుంటాడు. చివరికి కాట్, జిమ్ ఈ పరిస్థితి నుంచి బయట పడతారా ? ఆ మహమ్మారికి విరుగుడు దొరుకుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×