E-Paper
Advertisement

కారు డిక్కీలో చిక్కుకున్న మెడికల్ స్టూడెంట్… క్షణ క్షణం ఉత్కంఠ మలుపులు

కారు డిక్కీలో చిక్కుకున్న మెడికల్ స్టూడెంట్… క్షణ క్షణం ఉత్కంఠ మలుపులు
Advertisement

Suspense thriller OTT : ఓటీటీలో ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్ సినిమా ఆకట్టుకుంటోంది. ఇది ఒక స్పెషల్ మూవీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీని, ఒక కారు డిక్కీతో మొత్తం నడిపించి ప్రేక్షకులకు పిచ్చెక్కించాడు దర్శకుడు. కిడ్నాప్ అయిన ఒక అమ్మాయి డిక్కీలో పడే నరకాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా యాంగిల్స్ చాలా కొత్తగా ఉంటాయి. మనం కూడా ఆ డిక్కీలోనే ఇరుక్కుపోయామా అన్నంత ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే, ఇది హాలీవుడ్ సినిమా ‘బరీడ్’ (Buried) లాంటి క్లాస్ట్రోఫోబిక్ థ్రిల్లర్ కావడమే. కేవలం ఒకే క్యారెక్టర్, ఒకే లొకేషన్ ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా కథను మలుపులు తిప్పారు. ఈ జర్మన్ సినిమా తక్కువ బడ్జెట్‌తో తీసినా, క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ జర్మన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ట్రంక్: లాక్డ్ ఇన్’ (Trunk: Locked In). దీనికి దర్శకుడు మార్క్ షీషర్ డైరెక్ట్ చేశాడు. ఇక మలినా పాత్రలో సీనా మార్టెన్స్ యాక్టింగ్ ఇరగదీసింది ఇందులో. ఈ సినిమా మొత్తం 1 గంట 36 నిమిషాలు నిడివితో సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తుంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, మెట్రో గోల్డ్విన్ మేయర్ కలసి ఈ థ్రిల్లర్ సినిమాను నిర్మించాయి. మార్సెల్ బెకర్-న్యూ ఈ సినిమాకు ఉత్కంఠభరితమైన సంగీతాన్ని అందించారు. ఇది ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మలినా అనే ఒక మెడికల్ స్టూడెంట్ ఒక రోజు సడన్‌గా కళ్ళు తెరిచి చూసేసరికి, ఒక కారు డిక్కీలో కిడ్నాప్ అయ్యి ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు, అసలు తనని ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కాదు. పైగా ఆమె కాళ్లు మొద్దుబారిపోయి కదలలేని స్థితిలో ఉంటుంది. ఆమె దగ్గర ఉన్నది కేవలం ఒక ఫోన్ మాత్రమే. ఆ ఫోన్‌తో పోలీసులకు, తన తండ్రికి, ప్రియుడికి ఫోన్ చేసి సాయం కోరుతుంది. కానీ బయట ఉన్న వాళ్లకి ఈమె ఎక్కడుందో కనిపెట్టడం పెద్ద సవాలుగా మారుతుంది. ఆ కారు స్పీడ్‌గా వెళ్తూ ఉంటుంది, లోపల ఊపిరి ఆడదు. కిడ్నాపర్ ఎవరో తెలియదు కానీ, అప్పుడప్పుడు కారు ఆపి ఆమెను భయపెడుతూ ఉంటాడు.

ఇక మలినా తన మెడికల్ నాలెడ్జ్‌ని ఉపయోగించి, తన కాళ్లకు ఉన్న గాయాలను తానే డ్రెస్సింగ్ చేసుకుంటూ, ఆ చిన్న సందులో దొరికిన వస్తువులతోనే బయటపడటానికి రకరకాల ప్లాన్లు వేస్తుంది. ఫోన్ సిగ్నల్ పోవడం, బ్యాటరీ అయిపోవడం వంటి అడ్డంకులతో ప్రతి నిమిషం ఒక చావుబతుకుల పోరాటంలా సాగుతుంది. చివరికి అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేశారు? తన ప్రియుడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రాణాల మీద ఆశ వదులుకోకుండా, ఆ ఇరుకైన డిక్కీలోనే ఉంటూ కిడ్నాపర్‌తో ఆమె ఎలా ఫైట్ చేసింది ? చివరికి ప్రాణాలతో బయటపడిందా లేదా ? అన్నదే ఈ సినిమా క్లైమాక్స్. మొత్తం మీద ఈ సినిమా ఒక సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లర్.

Advertisement

Read Also : వరద నీటిలో వణికించే వాన.. వెంటాడి వేటాడే షార్క్ చేపలు

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×