E-Paper
Advertisement

వరద నీటిలో వణికించే వాన.. వెంటాడి వేటాడే షార్క్ చేపలు

వరద నీటిలో వణికించే వాన.. వెంటాడి వేటాడే షార్క్ చేపలు
Advertisement

Survival Thriller OTT : ఓటీటీలోకి మరో వారం రోజుల్లో అదిరిపోయే సర్వైవల్ హారర్ థ్రిల్లర్ రాబోతోంది. అయితే ఇది థియేటర్లలోకి వెల్లకుండానే డిజిటల్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఒక భారీ హరికేన్ (తుఫాను) కారణంగా తీర ప్రాంతం మొత్తం వరదల్లో మునిగిపోతుంది. ఆ వరద నీటితో పాటు ప్రమాదకరమైన షార్క్ చేపలు ఊరిలోకి వస్తాయి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకున్నారనేదే ఈ సినిమా కథ. దీని షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పక్కాగా వస్తున్న ఈ సినిమా, ఆడియన్స్ కు మస్త్ మజా ఇవ్వబోతోంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ సర్వైవల్ హారర్ సినిమా పేరు ‘ట్రాష్’ (Thrash). టామీ విర్కోలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఫోబ్ దైనేవర్, డిజిమోన్ హౌన్సౌ, విట్నీ పీక్ ప్రధాన పాత్రల్లో నటించారు. లిసా ఫీల్డ్స్ అనే గర్భిణీ స్త్రీ పాత్రలో ఫోబ్ దైనేవర్ నటించింది. తుఫాను సమయంలో ఒక కారులో చిక్కుకుపోయిన ఆమె, తన బిడ్డను కాపాడుకోవడానికి చేసే పోరాటం హైలైట్‌గా ఉంటుంది. డేల్ ఎడ్వర్డ్స్ పాత్రలో డిజిమోన్ హౌన్సౌ నటించారు. ఈయన ఇందులో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ చిత్రాన్ని మొదట సోనీ పిక్చర్స్ సంస్థ థియేటర్లలో విడుదల చేయాలని భావించింది. అయితే ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా హక్కులను దక్కించుకోవడంతో, దీనిని కేవలం ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 2026 ఏప్రిల్ 10నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్ సినిమా అయినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే సమయంలో తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక పక్క ఆకాశం చిల్లు పడ్డట్టు కుంభవృష్టి కురుస్తోంది, మరోపక్క సముద్రం పోటెత్తి ఊరి మీద పడింది. ఊరంతా చెరువులా మారిపోయి, నీళ్లు ఇళ్లను కూడా ముంచేస్తాయి. జనాలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణుకుతుంటే, ఆ వరద నీళ్లతో పాటు అసలు సిసలైన షార్క్ చేపలు ఎంట్రీ ఇస్తాయి. కంటికి కనిపించినోడిని కనిపించినట్టు పీక్కుతినే ఆ షార్క్ నోళ్ల నుండి, ఆ ప్రళయం లాంటి తుఫాను నుండి ఒక ఫ్యామిలీ ఎలా తప్పించుకుంది అనేది ఇందులో అసలు సీను. ఇక సెకండ్ హాఫ్ అయితే మామూలుగా ఉండదు. కరెంటు లేదు, బయటకు వెళ్లే దారి లేదు, ఇంట్లోకి వస్తే షార్కులు పీక్కుతింటాయి. ఎటు చూసినా చావే కనిపిస్తున్న టైంలో, హీరో హీరోయిన్లు వాటితో చేసే ఫైట్ మామూలుగా ఉండదు. చావు అంచున నిలబడి, ఆ రాక్షస చేపల వేట నుండి ప్రాణాలతో బయటపడటానికి వాళ్లు చేసే పోరాటమే ఈ సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది నీళ్లలో జరిగే కురుక్షేత్రం అన్నమాట.

Read Also : హైస్కూల్ డేస్ నుంచి పెళ్లి వరకు… చూసే కొద్దీ చూడాలనిపించే సిరీస్… ఐయండిబిలో 8.5 రేటింగ్

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×