E-Paper
Advertisement

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్
Advertisement

Tamil Emotional Animal Drama: అడవిలో ఓ ఏనుగుతో కష్టమైన పనులు చేయిస్తుంటే… దాన్ని చూసిన కొందరు వన్యప్రాణి సంరక్షకులు రహస్యంగా వీడియో తీస్తే ? ఆ వీడియో బయటకు వస్తే తమ వ్యాపారం దెబ్బతింటుందని భావించిన యజమాని… ఆ ఏనుగును ఎక్కడికైనా తరలించేందుకు కుట్ర చేస్తే ? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఏనుగును కాపాడేందుకు ఓ మావటివాడు వ్యవస్థతోనే పోరాడితే ? మనిషి, జంతువు మధ్య ఉండే అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన కదిలించే కథే ‘ది ఎల్లో ఎలిఫెంట్’ (The Yellow Elephant). మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

1990ల నేపథ్యంలో దక్షిణ తమిళనాడులోని అటవీ ప్రాంతాల్లో ఈ కథ మొదలవుతుంది. ఆ ప్రాంతాల్లో జింకలు, అడవి పందులను వేటాడేందుకు కొందరు ‘అవుట్టుకాయ్’ పేరుతో స్థానికంగా తయారు చేసే నాటు బాంబులను ఉపయోగిస్తుంటారు. ఇదే సమయంలో షణ్ముగం అనే కాంట్రాక్టర్ ప్రభుత్వ అనుమతులతో అడవిలో చెట్లను నరికిస్తూ కలప వ్యాపారం చేస్తుంటాడు. భారీ చెట్లను తరలించడం, వాటిని కలప డిపోకు తీసుకురావడం, లారీల్లోకి లోడ్ చేయడం వంటి కష్టమైన పనుల కోసం షణ్ముగం ఓ ఏనుగును ఉపయోగిస్తుంటాడు. దాని పేరు రాజు.

Advertisement

అయితే రాజును చెంగు అనే మావటివాడు సొంత మనిషిలా చూసుకుంటుంటాడు. రాజు, చెంగు మధ్య ఏర్పడిన అనుబంధం రోజురోజుకూ బలపడుతుంది. అయితే ఒకరోజు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. కొందరు వన్యప్రాణి సంరక్షకులు రహస్యంగా కలప డిపోలోకి వెళ్లి అక్కడ జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తారు. రాజుతో అత్యంత కఠినమైన పనులు చేయిస్తున్న దృశ్యాలను వీడియో తీసి అటవీ శాఖ అధికారులకు పంపిస్తారు.

ఆ వీడియో బయటకు వెళ్లడంతో షణ్ముగానికి చిక్కులు మొదలవుతాయి. అధికారులు తనపై చర్యలు తీసుకుంటారని భయపడిన అతను… సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుకుతాడు. రాజును డిపో నుంచి ఎవరికీ తెలియకుండా తరలించాలని, అవసరమైతే దాని జాడే లేకుండా చేయాలని రహస్యంగా ప్లాన్ చేస్తాడు. తన ప్రాణంగా భావించే రాజు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న చెంగు ఊరుకోడు. యజమాని కుట్రల నుంచి ఏనుగును కాపాడటంతో పాటు, అధికారుల నుంచి కూడా దాన్ని రక్షించాల్సిన బాధ్యత అతనిపై పడుతుంది.

Advertisement

ఇక్కడి నుంచే కథ అసలు మలుపు తీసుకుంటుంది. రాజును కాపాడేందుకు చెంగు ఎంత దూరం వెళ్లాడు ? తన అధికారాన్ని ఉపయోగించి షణ్ముగం వేసిన పథకాన్ని ఎలా అడ్డుకున్నాడు ? చివరికి రాజు అడవికి తిరిగి వెళ్లాడా ? లేక మనుషుల స్వార్థానికి బలయ్యాడా ? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘ది ఎల్లో ఎలిఫెంట్’ క్లైమాక్స్.

ఓటీటీలో తమిళంలోనే స్ట్రీమింగ్

భాస్కరన్ ఆర్ముగం దర్శకత్వం వహించిన ఈ సామాజిక డాక్యుమెంటరీ డ్రామాలో సెంధ్రాయన్ చెంగు పాత్రలో నటించారు. అడవి జంతువులపై జరుగుతున్న క్రూరత్వంతో పాటు, మనిషి-జంతువు మధ్య ఏర్పడే భావోద్వేగ బంధాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. ‘ఆహా తమిళ్’ (aha Tamil)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. ఒరిజినల్ తమిళ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే చూడాలి. జంతువులపై జరిగే క్రూరత్వం, సామాజిక సమస్యలు, ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారికి ఈ సినిమా ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: 80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

Tags

Related News

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

Big Stories

Advertisement
×