E-Paper
Advertisement

Tamil Movies OTT : ఫ్యామిలీ నుంచి కామెడీ ఎంటర్టైనర్ల వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తమిళ సినిమాలు ఇవే

Tamil Movies OTT : ఫ్యామిలీ నుంచి కామెడీ ఎంటర్టైనర్ల వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తమిళ సినిమాలు ఇవే
Advertisement

Tamil Movies OTT : ప్రతీవారం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు ఎంట్రీ ఇస్తున్నాయి. అందులో తెలుగు, హిందీ, మలయాళం, తమిళ, కన్నడ సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ఉంటున్నాయి. అయితే ఓటీటీల పుణ్యమా అని భాష ఏదైనా వదలకుండా సినిమాలను చూస్తున్నారు మూవీ లవర్స్. భాష అడ్డు కాదనుకుంటే వాళ్ళ కోసమే ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ఈ తమిళ సినిమాల లిస్ట్.

1. మాస్క్ (Mask)

వికర్ణన్ అశోక్ దర్శకత్వం తెరకెక్కిన తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘మాస్క్’. ఇందులో కవిన్, ఆండ్రియా జెర్మియా, రుహాని శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. గత ఏడాది నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, ప్రస్తుతం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. 440 కోట్లు దోచుకున్న మాస్క్డ్ గ్యాంగ్‌ ను పట్టుకోవడానికి ట్రై చేసే కరప్ట్ ప్రైవేట్ డిటెక్టివ్ వేలు చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది.

2. మహాసేనా (Mahasenha Volume 1)

Advertisement

దినేష్ కలైసెల్వన్ దర్శకత్వం వహించిన తమిళ మిస్టికల్ థ్రిల్లర్ ‘మహాసేనా వాల్యూమ్ 1). ఇందులో వేమల్, సృష్టి దంగే, యోగి బాబు, కబీర్ దుహాన్ సింగ్, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2025 డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కురంగని కొండల్లో పవిత్ర యాలి శిల్పాన్ని రక్షించుకునే గ్రామస్తులు, మాఫియా గ్యాంగ్ జరిగే గొడవే ఈ మూవీ.

3. అంగమ్మల్ (Angammal)

డైరెక్టర్ విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ డ్రామా ‘అంగమ్మల్’. ఈ మూవీలో గీతా కైలాసం అంగమ్మల్ అనే టైటిల్ రోల్ ను పోషించింది. అలాగ శరణ్ శక్తి, తెండ్రల్ రఘునాథన్, భరణి వంటి నటులు కీ రోల్స్ పోషించారు. 2025 డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

4. వజికావల్ (Vazhikaaval)

Advertisement

విజయ్ రాఘవ డైరెక్ట్ చేసిన ఈ తమిళ థ్రిల్లర్ లో ఆయనే హీరోగా నటించాడు. సాయి ప్రభు, సెంతిల్, లతా వంటి వారు సపోర్టింగ్ రోల్స్ చేశారు. జనవరి 9న షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ విడుదలైంది. అన్యాయంగా జైలు పాలైన ఓ వ్యక్తి కథ ఇది.

5. యెల్లో (Yellow)

డైరెక్టర్ హరి మహదేవన్ తీసిన ఈ మూవీలో పూర్ణిమా రవి, వైభవ్ మురుగేశాన్, సాయి ప్రసన్న, నమితా కృష్ణమూర్తి, దిల్లీ గణేష్, ప్రభు సాలమన్ తదితరులు నటించారు. 2025 నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కార్పొరేట్ జాబ్ వదిలేసి సోలో అడ్వెంచర్‌కి వెళ్లిన యువతి, స్ట్రేంజర్లతో ఫ్రెండ్‌షిప్ పెట్టుకుని కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేస్తుంది.

Read Also : ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ కి IMDbలో 8.3 రేటింగ్‌… కిర్రాక్ క్లైమాక్స్… సినిమా చరిత్రలోనే అలాంటి సీన్ చూసుండరు భయ్యా

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×