E-Paper
Advertisement

ఓటీటీలోకి గాయపడ్డ సింహం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి గాయపడ్డ సింహం.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Gaayapadda Simham:డైరెక్టర్ గా సత్తాచాటుతూ.. హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న తరుణ్ భాస్కర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం గాయపడ్డ సింహం . యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై అభిమానులు అప్పుడే ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే!

థియేట్రికల్ రన్ పూర్తయిన నాలుగు వారాలు తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ మొదటి వారం లేదా రెండవ వారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటించారు. అలాగే సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, యంగ్ హీరో శ్రీ విష్ణు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన , భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని , ఉమేష్ బన్సల్ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

also read:పీవీఆర్ ఐనాక్స్‌కు వెళ్తే రోగాలు గ్యారంటీ? ఆడియన్స్ ఆగ్రహం.. ఈ వీడియోలో నిజమెంత?

గాయపడ్డ సింహం సినిమా స్టోరీ..

ఇకపోతే గాయపడ్డ సింహం సినిమా స్టోరీ విషయానికి వస్తే.. దరహాస్ (తరుణ్ భాస్కర్) సాయి గాయత్రి (మానస చౌదరి) ని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే తనకు కాబోయే అల్లుడు అమెరికాలో సెటిల్ కావాలి అంటూ సాయి గాయత్రీ తండ్రి కండిషన్ పెట్టడంతో ఇక ఎలాగైనా సరే తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి అమెరికా వెళ్తాడు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న కొత్త రూల్స్ తో దరహాస్ ను వెనక్కు పంపించేస్తారు. దీంతో ట్రంప్ పై కోపం పెంచుకుంటాడు దరహాస్. అమెరికా అధ్యక్షుడి పై కోపంతో దరహాస్ ఏం చేశాడు? అతడు చేసిన పని వల్ల బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి) సిటీ వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దరహాస్ ఫ్రెండ్ విశ్వాస్ (కశ్యపు శ్రీనివాస్) కి ఒకప్పటి రూమ్ మేట్ , ఐఏఎస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న భైరవదాస్ (శ్రీ విష్ణు) ఏం చేశాడు? దరహాస్ గురించి తెలిసి కూడా తన కుమార్తె శాలినీ (అబ్దుల్లా అబ్దుల్లా) ను దరహాస్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఐజి విజయ్ కాంత్ (శుభలేఖ సుధాకర్) ఎందుకు ముందుకు వస్తారు? ట్రంప్ మీద దరహాస్ ప్రతీకారం తీర్చుకున్నాడా ? లేదా ? చివరికి అమెరికా ప్రయాణం ఏమైంది? మామ కోరిక నెరవేరిందా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికైతే ఫన్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి నిర్మాతలకు లాభాలు మిగులుస్తుందో లేదో చూడాలి.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×