E-Paper
Advertisement

కళ్లెదుటే భూమి కబ్జా.. ప్రాణహని ఉందని మొత్తుకున్న పట్టించుకోని అధికారులు.. చివరికి దారుణ హత్య..!

కళ్లెదుటే భూమి కబ్జా.. ప్రాణహని ఉందని మొత్తుకున్న పట్టించుకోని అధికారులు.. చివరికి దారుణ హత్య..!
Advertisement

Gadwal: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని మద్దెలబండ తండాలో భూ వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మద్దెలబండ తండాకు చెందిన చంద్రునాయక్ (40) కు చెందిన భూమిని, దాయాదులైన బొడియ రాములు నాయక్ కుటుంబ సభ్యతులు అక్రమించుకున్నారు. దీనిపై గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో‌ శనివారం తెల్లవారుజామున చంద్రునాయక్ తన పొలం వద్ద ఉండగా, నిందితులు రాములునాయక్ తో‌పాటు‌ మరికొందరు కలిసి పథకం ప్రకారం దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు.

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆరోపణలు

చంద్రు నాయక్ కు చెందిన భూమితో పాటు ప్రభుత్వ భూమిని రాములు నాయక్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని, దీనిపై బాధితుడు చంద్రునాయక్ తహసీల్దార్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చంద్రునాయక్ కు ప్రాణహాని ఉందని తెలిసినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని వారు మండిపడుతున్నారు.

Advertisement

Also Read: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్ గా సీత!

క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు..

ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మృతునికి భార్యతో పాటు పిల్లలు ఉండటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

Also read: ఆస్కార్ కొత్త రూల్స్.. నటులకు గుడ్ న్యూస్!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×