E-Paper
Advertisement

పీవీఆర్ ఐనాక్స్‌కు వెళ్తే రోగాలు గ్యారంటీ? ఆడియన్స్ ఆగ్రహం.. ఈ వీడియోలో నిజమెంత?

పీవీఆర్ ఐనాక్స్‌కు వెళ్తే రోగాలు గ్యారంటీ? ఆడియన్స్ ఆగ్రహం.. ఈ వీడియోలో నిజమెంత?
Advertisement

PVR INOX:సినిమా అంటే వినోదం.. కానీ ఆ వినోదం కోసం భారీగా డబ్బులు చెల్లించి థియేటర్‌కు వెళ్తే, అక్కడ ఎదురయ్యే చేదు అనుభవాలు ప్రేక్షకులను విసిగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) థియేటర్లలో సరైన నిర్వహణ లేకపోవడం, అపరిశుభ్రత మరియు సాంకేతిక లోపాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “పీవీఆర్ వెళ్తే రోగాలు గ్యారంటీనా?” అనే స్థాయిలో నెటిజన్లు సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

అకస్మాత్తుగా షోల రద్దు:

గచ్చిబౌలిలోని ప్రిజం మాల్‌తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోని PVR థియేటర్లలో షోలు అకస్మాత్తుగా రద్దవుతుండటం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. పవర్ ఫెయిల్యూర్ లేదా సాంకేతిక కారణాలు అంటూ సినిమా మొదలైన తర్వాత షోలు ఆపేయడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. ప్లాన్ చేసుకుని సినిమాకు వెళ్తే, మధ్యలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం వల్ల సమయంతో పాటు డబ్బులు కూడా వృథా అవుతున్నాయని ప్రేక్షకులు వాపోతున్నారు.

అపరిశుభ్రతతో అనారోగ్య భయం:

Advertisement

మల్టీప్లెక్స్ అంటే మనం క్లీన్‌గా ఉంటుందని ఆశిస్తాం. కానీ పీవీఆర్ లోని వాష్ రూమ్స్ నిర్వహణ అధ్వానంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల వాష్ రూమ్స్ పని చేయకపోవడం, విపరీతమైన దుర్వాసన రావడం వంటి సమస్యలు ఉన్నాయి. ఇక ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని జనం భయపడుతున్నారు. టికెట్ల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నా, కనీసం పరిశుభ్రత పాటించకపోవడంపై ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యాప్ సమస్యలు.. రీఫండ్ కష్టాలు:

సినిమా రద్దయినప్పుడు లేదా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నప్పుడు PVR యాప్ సరిగ్గా పని చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. కస్టమర్ సపోర్ట్ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ప్రేక్షకులు పరేషాన్ అవుతున్నారు. ఇక టికెట్ క్యాన్సిల్ చేసే ఆప్షన్ యాప్‌లో పని చేయకపోవడం వల్ల డబ్బులు తిరిగి రావడం లేదని చాలా మంది తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. దీనిపై అడిగేందుకు థియేటర్ సిబ్బందిని కలిస్తే వారు కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

also read:దూకుడు పెంచిన గోపీచంద్.. మరో యాక్షన్ డ్రామాకి సిద్ధం!

స్క్రీన్ అలైన్‌మెంట్ మరియు సిబ్బంది తీరు:

కొన్ని చోట్ల ప్రొజెక్షన్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోవడంతో సినిమా క్లారిటీగా కనిపించడం లేదు. స్క్రీన్ పైన బొమ్మ సరిగ్గా రాకపోయినా,సీట్స్ సరిగ్గా క్వాలిటీ లేకపోవటం, సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా పట్టించుకునే నాథుడే లేడని ప్రేక్షకులు అంటున్నారు. ఇక వీటికి తోడు సిబ్బంది ప్రవర్తన కూడా కొన్ని చోట్ల వివాదాస్పదంగా మారింది. సమస్యల గురించి అడిగిన వారిపై సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

బ్రాండ్ ఇమేజ్ చూసి పీవీఆర్ ఐనాక్స్‌కు వెళ్తున్న ప్రేక్షకులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మెయింటెనెన్స్ శూన్యం, హైజీన్ సమస్యలు వెరసి మల్టీప్లెక్స్ వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి ఈ లోపాలను సరిదిద్దకపోతే, ప్రేక్షకులు ఈ థియేటర్లకు దూరమయ్యే ప్రమాదం ఉంది. మరి ఇక ఈ గొడవపై పీవీఆర్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. వినోదం పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని, సమయాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదు అంటున్నారు నెటిజన్స్.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×