E-Paper
Advertisement

చిన్న పిల్లలను దారుణంగా చంపే సీరియల్ కిల్లర్… అడుగడుగునా సస్పెన్స్ తో కట్టిపడేస్తున్న స్టోరీ

చిన్న పిల్లలను దారుణంగా చంపే సీరియల్ కిల్లర్… అడుగడుగునా సస్పెన్స్ తో కట్టిపడేస్తున్న స్టోరీ
Advertisement

Psychological Crime Thriller OTT : మైండ్ బెండింగ్ ట్విస్ట్ లతో పిచ్చెక్కించే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగే ఇలాంటి స్టోరీలకు థ్రిల్లర్ ప్రియులు బాగా అట్రాక్ట్ అవుతుంటారు. ఈ వీకెండ్ అలాంటి ఒక మంచి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ తో ఎంటర్టైన్ అవుదాము అనుకునే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు The Alienist (2018). 19వ శతాబ్దపు చివరలో న్యూయార్క్ నగర నేపథ్యంలో సాగే పీరియడ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కాలేబ్ కార్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం భారతదేశంలో Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రెండు సీజన్లు ఉన్నాయి: మొదటిది ‘The Alienist’ కాగా, రెండో సీజన్ ‘The Angel of Darkness’. ఈ సిరీస్‌లో 1890ల నాటి న్యూయార్క్ నగరాన్ని, అక్కడి మురికివాడలను, ధనవంతుల విలాసాలను అద్భుతంగా చూపించారని చెప్పాలి. ఇందులోని సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ఒకటేమిటి అన్నీ ఆడియన్స్ ను ఆ పాత కాలంలోకి తీసుకెళ్తాయి. డేనియల్ బ్రూల్, లూక్ ఈవాన్స్, డాకోటా ఫాన్నింగ్ తమ పాత్రల్లో జీవించారు. ఇందులో వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీ హంతకుడు ఎవరో తెలిసినప్పుడు కలిగే షాక్ ఈ సిరీస్‌కే హైలైట్ గా ఉంటుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ 1896లో న్యూయార్క్‌ లో షురూ అవుతుంది. నగరంలో వరుసగా చిన్న పిల్లలు అత్యంత దారుణంగా హత్యకు గురవుతుండడం ఆందోళనకరంగా మారుతుంది. ముఖ్యంగా వ్యభిచార గృహాల్లో పని చేసే అబ్బాయిలు ఇలా మర్డర్ అవుతూ ఉంటారు. అప్పట్లో మానసిక వ్యాధులను నయం చేసే డాక్టర్లను ‘ఏలియనిస్ట్’ అని పిలిచేవారు. డాక్టర్ లాస్లో క్రైజ్లర్ అనే ఏలియనిస్ట్, తన స్నేహితుడైన వార్తాపత్రిక ఇలస్ట్రేటర్ జాన్ మూర్, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ లో సెక్రటరీగా పని చేసే ధైర్యవంతురాలైన సారా హోవార్డ్ కలిసి ఈ కేసును ఛేదించడానికి ఒక సీక్రెట్ టీంగా ఏర్పడతారు.

Also Read : ఇదేం సినిమా సామి మతి పోతోంది… యంత్రానికి మనిషికి పుట్టిన వింత… క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోలేరు

Advertisement

ఆ కాలంలో ఫింగర్ ప్రింట్స్ లేదా డిఎన్ఏ పరీక్షలు వంటి ఆధునిక టెక్నాలజీ ఉండేది కాదు. అందుకే డాక్టర్ క్రైజ్లర్ ఈ సిరీస్ లో ‘క్రిమినల్ సైకాలజీ’ని వాడతారు. అంటే ఆ హంతకుడు ఇలాంటి హత్యలే ఎందుకు చేస్తున్నాడు ? అతని బాల్యం ఎలా ఉండి ఉంటుంది ? అతని మనస్తత్వం ఏమిటి ? అనేది విశ్లేషిస్తారు. అలా హంతకుడిని పట్టుకోవాలని చూస్తారు. అయితే అప్పట్లో ఉన్న అవినీతిపరులైన పోలీసులు, సమాజంలోని పెద్ద మనుషులు వీళ్ళ పరిశోధనకు అడ్డుగా ఉంటారు. హంతకుడి వేటలో ఈ టీం ఎదుర్కొనే భయంకరమైన నిజాలు ఏంటి? కిల్లర్ ఎవరు? అనే ప్రశ్నలు ఈ సిరీస్‌ ను ఉత్కంఠభరితంగా మారుస్తాయి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×