E-Paper
Advertisement

ఇదేం సినిమా సామి మతి పోతోంది… యంత్రానికి మనిషికి పుట్టిన వింత… క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోలేరు

ఇదేం సినిమా సామి మతి పోతోంది… యంత్రానికి మనిషికి పుట్టిన వింత… క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోలేరు
Advertisement

Body Horror Movie on OTT : ఓటీటీలో మైండ్ పోయే అసలు సిసలు బాడీ హారర్ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది. అయితే ఇందులో రక్తం, హింస, వింతైన సీన్లు జనం తట్టుకోలేనంత ఘోరంగా ఉంటాయి. ఒక సైకో పిల్లకు కార్ల మీద ఉండే మోజు, ఆ తర్వాత ఆమె చేసే వరుస హత్యలు చూస్తుంటే గుండె అదిరిపోద్ది. కానీ సినిమాలో ఒక వింతైన ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ సినిమా చాలా విభిన్నంగా, కొన్ని చోట్ల చూడటానికి ఇబ్బందిగా అనిపించే సన్నివేశాలతో ఉంటుంది. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, కానీ డిఫరెంట్ కంటెంట్ ను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది.

స్టోరీలోకి వెళ్తే

2021లో వచ్చిన ఈ ఫ్రెంచ్-బెల్జియన్ బాడీ హారర్ సినిమా’టైటాన్’ (Titane). దీనికి జూలియా డుకోర్నో దర్శకత్వం వహించారు. ఈ సినిమా మేకింగ్ వెనుక ఒక వింతైన కథ ఉంది. దర్శకురాలు జూలియా డుకోర్నోకు వచ్చిన ఒక పీడకల ఆధారంగా ఈ కథను రాసుకున్నారు. 74 ఏళ్ల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో అత్యున్నతమైన పామ్ డి ఓర్ అవార్డును గెలుచుకున్న రెండో మహిళా దర్శకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. మనిషికి, యంత్రానికి మధ్య ఉండే వింత సంబంధాన్ని, అలాగే ఏమాత్రం రక్తం పంచుకోని ఇద్దరు వ్యక్తుల మధ్య పుట్టే అనుబంధాన్ని ఈ సినిమాలో ఎవరూ ఊహించని రీతిలో చూపించారు. ఇక హీరోయిన్ అగాథే రౌసెల్లెకి ఇది మొదటి సినిమా అయినప్పటికీ, ఆమె నటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బాడీ హారర్ సీన్లలో ఆమె చూపించిన హావభావాలు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. సినిమాలోని విజువల్స్, సౌండ్ ట్రాక్ చాలా ఇంటెన్స్‌గా ఉండి, చూసేటప్పుడు ఒక రకమైన వింత అనుభూతిని కలిగిస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా MUBI, Amazon Prime Video ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

అలెక్సియా అనే ఒక అమ్మాయికి చిన్నప్పుడే ఒక పెద్ద కారు యాక్సిడెంట్ అవుతుంది. ఆ దెబ్బతో డాక్టర్లు ఆమె తలలో ఒక టైటానియం ప్లేట్ పెడతారు. ఇక అప్పటినుంచి ఆమెకి మామూలు మనుషుల మీద కంటే కార్ల మీదే ఎక్కువ మోజు పెరుగుతుంది. పెరిగి పెద్దయ్యాక కార్ షోలలో డాన్సులు వేస్తూ, మనుషుల్ని చంపే సైకోలా మారుతుంది. ఒకానొక టైమ్‌లో ఒక కారుతో వింతగా రిలేషన్ పెట్టుకుని, అసలు ఊహించని విధంగా కడుపు కూడా తెచ్చుకుంటుంది. అంతటితో ఆగకుండా వరుసగా మనుషుల్ని హత్యలు చేస్తూ ఉంటుంది. పోలీసులు కూడా ఆమెను వెతకడం స్టార్ట్ చేస్తారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి అలెక్సియా తన జుట్టు కట్ చేసుకుని, ముక్కు పచ్చడి చేసుకుని, గుర్తు పట్టకుండా ఒక అబ్బాయిలా వేషం మారుస్తుంది.

పదేళ్ల క్రితం తప్పిపోయిన ఆడ్రియన్ అనే అబ్బాయి నేనే అని నమ్మించి, విన్సెంట్ అనే ఒక ఫైర్ స్టేషన్ ఆఫీసర్ దగ్గరికి చేరుతుంది. ఆ విన్సెంట్ కూడా తన కొడుకు దొరికాడన్న సంతోషంతో ఈమెను గుర్తుపట్టకుండా ఇంట్లోకి రానిస్తాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అబ్బాయి వేషంలో ఉన్న ఈమె కడుపు పెరుగుతూ ఉంటుంది. అబ్బాయికి కడుపు ఏందిరా బాబు అని చుట్టుపక్కల వాళ్లకి డౌట్ వస్తుంది. ఇంకోవైపు లోపల ఉన్నది మనిషి కాదు కాబట్టి, ఆమె కడుపు నుంచి రక్తం బదులు నల్లటి ఇంజిన్ ఆయిల్ కారుతుంటుంది. ఇక చివరగా ఆ విన్సెంట్ కు ఈమె నిజం తెలిసినా సరే, తన కొడుకులాగా ప్రేమగా చూసుకుంటాడు. ఆఖరికి ఆ కడుపులో ఉన్నది బయటకి వచ్చినప్పుడు జరిగే సీన్ మాత్రం మామూలు షాకింగ్ ఉండదు. చూస్తే మతిపోతుంది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : ప్రతి ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌… సైకాలజీతో నేరగాళ్లకు చుక్కలు చూపించే ఇన్వెస్టిగేటర్… ఐయండిబిలో 8.2 రేటింగ్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×