E-Paper
Advertisement

OTT Movie : 487 కోట్ల బడ్జెట్.. 4389 కోట్ల కలెక్షన్స్ మోత… క్షణక్షణం ఉత్కంఠ… భయం అంటే ఎలా ఉంటుందో చూపించిన మూవీ

OTT Movie : 487 కోట్ల బడ్జెట్.. 4389 కోట్ల కలెక్షన్స్ మోత… క్షణక్షణం ఉత్కంఠ… భయం అంటే ఎలా ఉంటుందో చూపించిన మూవీ
Advertisement

OTT Movie : థియేటర్లలో ఈ ఏడాది విడుదలైన ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ రకార్డులు సృష్టించింది. 487 కోట్ల బడ్జెట్‌తో ₹4389 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. భారతదేశంలో 80 కోట్లకు పైగా  వసూలు చేసి, ప్రేక్షకులకు కావాల్సినంత భయాన్ని కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఒకే రోజు ఈ ‘కంజురింగ్ యూనివర్స్’ లో ఉన్న అన్ని సినిమాలను స్ట్రీమింగ్ కి రానున్నాయి. ఇవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి ? వీటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘కంజురింగ్’ ఫ్రాంచైజీ మొదటి భాగం 2013 ఆగస్టు 2న విడుదలైంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, HBO మ్యాక్స్ నవంబర్ 22న ఒక ప్రత్యేక మారథాన్‌ను తీసుకువస్తోంది. దీనిలో మొత్తం కంజురింగ్ యూనివర్స్ నుండి సినిమాలు ప్రదర్శించబడతాయి. ఈ మారథాన్ ఉదయం 7.35 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’తో ముగుస్తుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్మర్ల్ కుటుంబం ఒక కొత్త ఇంట్లోకి మారుతారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, త్వరలోనే ఆ ఇంట్లో వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి. అంతుచిక్కని శబ్దాలు, వస్తువులు వాటంతట అవే కదలడం, కుటుంబ సభ్యులకు భయంకరమైన కలలు రావడం వంటివి జరుగుతాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో, ఇది కేవలం దెయ్యం పట్టిన ఇల్లు మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన దుష్టశక్తి అక్కడ తిష్ట వేసిందని వారికి అర్థమవుతుంది. దీంతో వాళ్ళు పారానార్మల్ డిటెక్టివ్స్ ఎడ్, వారెన్ ల సహాయాన్ని కోరతారు.

Read Also : ఉద్యోగం కోసం వచ్చి ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? గూస్ బంప్స్ తెప్పించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

వారెన్ దంపతులు కేసును విచారించడం ప్రారంభించినప్పుడు, ఇది వాళ్ళు గతంలో ఎదుర్కొన్న కేసుల కంటే భిన్నంగా ఉందని తెలుసుకుంటారు. వీళ్ళు మొట్ట మొదటి కేసులో ఎదుర్కొన్న ఒక శక్తివంతమైన దెయ్యంగా దీన్ని గుర్తిస్తారు. ఆ దుష్టశక్తిని అప్పట్లో ఓడించామని వాళ్ళు భావించినా, అది తిరిగి వచ్చి వాళ్ళను లక్ష్యంగా చేసుకుంటుంది. వీళ్ళు తమ అతీంద్రియ శక్తులను ఉపయోగించి ఆ దెయ్యాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో హారర్ పీక్స్ కి వెళ్తుంది. చివరికి ఆ దెయ్యాన్ని వీళ్ళు వెళ్లగొడతారా ? దాని చేతిలో బలవుతారా ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×