E-Paper
Advertisement

OTT Movie : నరకానికి క్యూ కట్టే ప్రజలు… సైన్స్ ప్రూవ్ చేసే చచ్చాక జీవితం… మైండ్ బెండింగ్ సై-ఫై సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : నరకానికి క్యూ కట్టే ప్రజలు… సైన్స్ ప్రూవ్ చేసే చచ్చాక జీవితం… మైండ్ బెండింగ్ సై-ఫై సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : మనం చచ్చిపోతే ఏమవుతుంది? ఏదో ఒక అవతలి ప్రపంచం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఏమవుతుంది? ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన మైండ్ బ్లోయింగ్ మూవీ ‘ది డిస్కవరీ’. ఇప్పటివరకు వచ్చిన టాప్ 5 సై ఫై మూవీల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా ఇది. దీనిని చూసాక మీ మైండ్ లో రెండు రోజులు రొటేట్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమా ఏ ఓటీ టీ లో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2017లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘ది డిస్కవరీ’ (The Discovery). డైరెక్టర్ చార్లీ మెక్‌డౌల్ తన రెండో సినిమాతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాడు. దీనికి అతనే రైటర్ కూడా. ఇందులో జేసన్ సెగల్, రూనీ మారా, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, జెస్సీ ప్లెమన్స్, రైలీ కియో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2017 మార్చి 31న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ రిలీజ్ అయింది. 102 నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 6.5/10 రేటింగ్ ని పొందింది.

స్టోరీ లోకి వెళ్తే

Advertisement

సైంటిస్ట్ థామస్ హార్బర్ ఒక వండర్ డిస్కవరీ సృష్టిస్తాడు. మనం చచ్చిపోతే అవతలి ప్రపంచం ఉందని సైంటిఫిక్‌ గా ప్రూవ్ చేస్తాడు. ఈ న్యూస్ వచ్చిన వెంటనే ప్రపంచమంతా గందరగోళం అవుతుంది. చచ్చిపోతే మళ్లీ పుట్టొచ్చు, బెటర్ లైఫ్ వచ్చేస్తుందని అనుకుని, చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటారు. ఈ గందరగోళం నడుస్తుండగా, థామస్ కొడుకు విల్, దీనికంతటికి కారణమైన తన తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు. ఒక రోజు బోట్‌లో వెళ్తుండగా విల్‌కి ఒక ఐలా అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె కూడా సూసైడ్ చేసుకోబోతుంది. విల్ ఆమెని ఆపి, తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తాడు.

Read Also : ఏడుగురు బాయ్ ఫ్రెండ్స్‌తో ఏంది భయ్యా ఆ అరాచకం… అలాంటి సీన్లున్న సినిమానే

 థామస్ ఒక సీక్రెట్ ల్యాబ్ నడుపుతూ, చచ్చిపోయిన వాళ్లని రికార్డ్ చేసే ఒక మెషిన్ తయారు చేస్తున్నాడు. ఇక్కడి నుంచి మొదలవుతుంది మెయిన్ మిస్టరీ. నిజంగా అవతలి ప్రపంచం ఉందా? అక్కడ ఏముంది? లవ్, మెమరీస్ అక్కడికి వెళ్తాయా? అనే ప్రశ్నలతో చివరి 20 నిమిషాలు ఫుల్ ట్విస్ట్ లు ఉంటాయి. ఒక్కసారి మైండ్ బ్లాంక్ అవుతుంది. మరి అలాంటి క్లైమాక్స్ ని మీరు కూడా చూడాలనుకుంటే, ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.
Advertisement

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×