E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తల్లినే బురిడీ కొట్టించిన తనూజా… డెమోన్ ఫస్ట్ లవ్ రమ్యానా? గోవాకి రీతూ ఎస్కేప్… అందరూ దొంగలే

Bigg Boss 9 Telugu : తల్లినే బురిడీ కొట్టించిన తనూజా… డెమోన్ ఫస్ట్ లవ్ రమ్యానా? గోవాకి రీతూ ఎస్కేప్… అందరూ దొంగలే

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తమ జీవితాల్లో చేసిన చిలిపి పనులను తాజాగా వెల్లడించి, తమ అభిమానులకు కూడా షాక్ ఇచ్చారు. ఒక్కొక్కరూ తమ తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్నో చిలిపి పనులు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లికే మస్కా కొట్టిన తనూజా

నాగార్జున ఆదివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తమ సీక్రెట్స్ చెబితేనే ఫ్యామిలీని లోపలకు అనుమతిస్తానని చెప్పాడు. దీంతో ఒక్కొక్కరుగా సీక్రెట్స్ చిట్టాలు విప్పారు. తనూజా తమ అపార్ట్మెంట్లోకి ఎవరైనా రావాలంటే, ఒక యాప్ ద్వారా యాక్సెస్ ఉంటుందని చెప్పింది. ఆ యాప్ తమ ఇంట్లో తన తల్లికి మాత్రమే ఉంటుందని, కానీ తాను సీక్రెట్ గా ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్ కి ప్రీ అప్రూవల్ ఇచ్చేదాన్నని చెప్పింది. అయితే ప్రీ అప్రూవల్ ఇస్తే నోటిఫికేషన్ వెళ్ళదని, అలా తన ఫ్రెండ్స్ ను కలిసేదాన్నని తన టాప్ సీక్రెట్ ను చెప్పేసింది.

రీతూ తక్కువేం కాదు

తరువాత రీతూ వచ్చేసి తన సీక్రెట్ ను చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తాము న్యూ ఇయర్ సందర్భంగా గత ఏడాది నైట్ 3 గంటల వరకు ఒక్కో ఫ్రెండ్ తో ఒక్కో ఇంటికి వెళ్లామని చెప్పింది. అయితే అప్పటికప్పుడే తనకు గోవాకు వెళ్ళాలి అన్పించిందని, దీంతో అందరినీ ఒప్పించి గోవాకు ఒక్కొక్కరికీ తానే ఫ్లైట్ టికెట్ కొని మరీ తీసుకెళ్ళాను అని చెప్పింది. అయితే తీరా అక్కడికి వెళ్ళాక తన డబ్బులే బొక్క అనే విషయం అర్థం అయ్యి, టికెట్ డబ్బులు తీసుకున్నాను అని చెప్పింది. ఇదంతా జరిగాక అక్కడే 2 రెండు ఎంజాయ్ చేశామని, కానీ ఆ రెండు రోజులు ఇంట్లో వాళ్లకు మాత్రం వేరే ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నామని అబద్దాలు చెప్పాను అంటూ ఓపెన్ అయ్యింది.

డెమోన్ ఫస్ట్ లవ్ రమ్య

ఇక మంచి పిల్లాడిలా కనిపించే డెమోన్ కూడా తక్కువేం తినలేదు. తన ఫస్ట్ లవ్ రమ్యా అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒక్కసారిగా అందరూ పచ్చళ్ళ పాప అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి కాదు, నేను 10వ తరగతి చదువుకునే రోజుల్లో అదే పేరుతో ఓ అమ్మాయి ఉండేది. ఆమె తన పేరెంట్స్ తో థియేటర్ కి వస్తే, తాను ఫ్రెండ్స్ తో థియేటర్ కు వెళ్లానని, అక్కడే మొదటిసారి చూసి ప్రేమలో పడ్డాను అని చెప్పాడు. ఆ తరువాత ఎగ్జామ్స్ లో కూడా ఆమెను కలిశాను అన్నాడు. అలాగే మరో సీక్రెట్ కూడా వెల్లడించాడు. తన ఫ్రెండ్ మందు బాటిల్ తెచ్చి తన ఇంట్లో దాస్తే, తాను వాటిని మిద్దెపైకి ఎక్కి టేస్ట్ చేసేవాడిని అని నాలుక కరుచుకున్నాడు.

Read Also : అమ్మను చూడగానే తనూజ ఎమోషనల్… అటు తిరిగి ఇటు తిరిగి భరణికే ఫిట్టింగు… ఇమ్మూ చేతిలో ఎలిమినేషన్ పవర్

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×