E-Paper
Advertisement

Horror movie OTT: మనుషుల్ని బతికుండగానే తినే ఊరు… గుండెలు జారిపోయే సీన్లు

Horror movie OTT: మనుషుల్ని బతికుండగానే తినే ఊరు… గుండెలు జారిపోయే సీన్లు
Advertisement

Horror movie OTT : రక్తం ఏరులై పారేలా సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూసేయండి. ఈ కథ అమెజాన్ అడవులను కాపాడాలని వెళ్ళిన కొంతమంది టీమ్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళంతా నరమాంస భక్షకుల చేతికి చిక్కిన తరువాత స్టోరీ హింసాత్మకంగా మారుతుంది. అయితే ఆది వాసీలను నరమాంస భక్షకులుగా చూపించడం వల్ల, ఈ సినిమా అప్పట్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి బలహీనమైన వాళ్ళు దీనికి దూరంగా ఉండటం మంచిది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ వివాదాస్పద కానిబాల్ హర్రర్ సినిమా పేరు ‘ది గ్రీన్ ఇన్ఫెర్నో’ (The Green Inferno). ప్రముఖ హర్రర్ డైరెక్టర్ ఎలి రోత్ రూపొందించిన ఈ సినిమాలో లోరెంజా ఇజ్జో, ఏరియల్ లెవీ, డారిల్ సబారా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 2013 సెప్టెంబర్ 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా 2015 సెప్టెంబర్ 25న థియేటర్‌లలో విడుదలైంది. ఈ చిత్రం $5 మిలియన్ల బడ్జెట్‌లో $13 మిలియన్లు వసూలు చేసి, ఒక మోస్తరు విజయాన్ని సాధించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథలో కొంతమంది సిటీ కాలేజీ కుర్రాళ్ళు, సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయిపోవాలని తెగ ఆరాటపడుతుంటారు. మేము అడవులను కాపాడతాం, అక్కడ ఉన్న జనాలను రక్షిస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పి, అమెజాన్ అడవుల్లోకి వెళ్తారు. సీన్ కట్ చేస్తే, వాళ్ళు వెళ్తున్న విమానం అడవి మధ్యలో కుప్పకూలిపోతుంది. అక్కడి వరకు అంతా ఓకే కానీ, అసలు సినిమా అప్పుడే మొదలవుతుంది. వీళ్లు ఎవరినైతే కాపాడాలని వెళ్లారో, అదే అడవి మనుషులు (కానిబాల్స్) వచ్చి వీళ్లను బంధిస్తారు. ఆ తెగ జనాలకి బయటి ప్రపంచం తెలియదు.

వాళ్ళకి తెలిసిందల్లా మనుషులను కోసుకు తినడమే. వీళ్ళని బంధించి ఒక బోనులో వేసి, ఒక్కొక్కరిని తీసుకెళ్లి కూరగాయలు కోసినట్టు కోసి, పచ్చి మాంసాన్ని తినేస్తుంటారు. ఆ సీన్లు చూస్తుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.  చివరికి వాళ్ళల్లో ఎవరైనా ఆ నరమాంస భక్షకుల నుంచి తప్పించుకున్నారా ? అసలు ప్రాణాలతో బయటపడ్డారా ? అనే విషయాలను మాత్రం, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ప్రేమ పేరుతో బురిడి… భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్… బుర్ర గిర్రున తిరిగే ట్విస్టులు

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×