E-Paper
Advertisement

OTT Movie : భర్త టార్చర్ తట్టుకోలేక పారిపోయిన భార్యకు బుర్ర బద్దలయ్యే షాక్… హర్రర్ తో పాటు ఫ్యూజులు అవుటయ్యే సీన్స్

OTT Movie : భర్త టార్చర్ తట్టుకోలేక పారిపోయిన భార్యకు బుర్ర బద్దలయ్యే షాక్… హర్రర్ తో పాటు ఫ్యూజులు అవుటయ్యే సీన్స్
Advertisement

OTT Movie : హారర్ సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అడుగడుగునా భయపెట్టే సీన్స్, మ్యూజిక్, అద్భుతమైన కథ, స్పెషల్ ఎఫెక్ట్ ఉంటే ఆ మూవీకి వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఈ జానర్లో ఎన్నో మాస్టర్ పీస్ సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో ఓ హర్రర్ ఆణిముత్యాన్ని ఈ రోజు మన మూవీ సజెషన్ లోకి తీసుకొచ్చాము. మరి ఇంకెందుకు ఆలస్యం… ఆ హర్రర్ స్టోరీ ఏంటి? సినిమా పేరు, ఓటీటీ డీటైల్స్ వంటి వివరాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

లీ వానెల్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మాస్టర్ పీస్ ‘ The Invisible Man (2020)’. H.G. వెల్స్ క్లాసిక్ నవలను మోడర్న్ ట్విస్ట్‌తో అడాప్ట్ చేసి, ఈ సినిమాను రూపొందించారు. హాలీవుడ్ హీరోయిన్ ఎలిజబెత్ మాస్ (సెసిలియా కాస్) ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది. ఒలివర్ జాక్సన్-కోహెన్ (అడ్రియన్ గ్రిఫిన్), ఆల్డిస్ హాడ్జ్, హారియట్ డైర్, స్టార్మ్ రీడ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం Amazon Prime Videoలో రెంట్ కు అందుబాటులో ఉన్న ఈ సినిమా IMDbలో 7.1 రేటింగ్ సంపాదించింది.

Advertisement

Read Also :  ఈ వీకెండ్‌కు ఇంట్లోనే అచ్చ తెలుగు ఎంటర్టైన్మెంట్… ఓటీటీలో 5 కొత్త సినిమాలు సిరీసులు

స్టోరీలోకి వెళ్తే…

సెసిలియా కాస్ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ అడ్రియన్ తో ఉంటుంది. కానీ అతడు ఆమెను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకోసం కొట్టడం, తిట్టడం వంటివి చేసి టార్చర్ పెడుతూ ఉంటాడు. నిజానికి అడ్రియన్ ఒక బ్రిలియంట్ ఆప్టిక్స్ సైంటిస్ట్. ఇక బాయ్ ఫ్రెండ్ పెట్టే టార్చర్ ను తట్టుకోలేక ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా పారిపోతుంది. అలా వెళ్ళిస్నేహితుడు జేమ్స్ (ఆల్డిస్ హాడ్జ్) ఇంట్లో దాక్కుంటుంది. ఈ నేపథ్యంలోనే అడ్రియన్ సూసైడ్ చేసుకున్నట్టు వార్త వస్తుంది. అతడి ఆస్తి వారసత్వంగా సెసిలియాకు వస్తుంది. ఇక అంతా సెట్ అయినట్టే అనుకుంటున్న తరుణంలో ఆమెను ఎప్పుడూ ఎవరో తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు వింత వింత విచిత్ర సంఘటనలు జరుగుతాయి. వస్తువులు వాటంతట అవే కదులుతాయి. గాలి వీస్తుంది.. కానీ చూస్తే ఎవరూ కనిపించరు.

Advertisement

ఇవన్నీ అనుభవించాక సెసిలియా తన ఎక్స్ చనిపోయాడని వచ్చిన వార్తలు ఫేక్ అని అనుకుంటుంది. అతను చావలేదని, ఇన్విజిబిలిటీ టెక్నాలజీతో తనను టార్చర్ చేస్తున్నాడని భావిస్తుంది. కానీ ఎవరూ ఆమె మాటను ఎవ్వరూ నమ్మరు. ఆమెకు పిచ్చి ఎక్కిందని అనుకుంటారు. మరీ అతను చనిపోలేదని హీరోయిన్ ఎలా ప్రూవ్ చేసింది ? ఇన్విజిబుల్ గా మారిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మూవీని చూడాల్సిందే. ఇందులో సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉంటాయి. ట్విస్ట్స్‌తో నిండిన కథ, ఎమోషనల్ ఇంపాక్ట్ సినిమాను మర్చిపోకుండా చేస్తాయి.

Related News

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×