E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఇమ్మూను దెబ్బ కొట్టిన బ్యాడ్ సెంటిమెంట్… రోగ్ రోబోతో ఫెంటాస్టిక్ ఫోర్ గా ఎలిమినేట్

Bigg Boss 9 Telugu : ఇమ్మూను దెబ్బ కొట్టిన బ్యాడ్ సెంటిమెంట్… రోగ్ రోబోతో ఫెంటాస్టిక్ ఫోర్ గా ఎలిమినేట్
Advertisement

Bigg Boss 9 Telugu Grand Finale : బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరుగుతోంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ, ఎక్స్ హౌస్ మేట్స్, అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ తో సందడి నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఓటింగ్ తో టాప్ 5 లిస్ట్ మాత్రం తారుమారు అయ్యింది. టాప్ 2 లేదా 3లో అయినా ఉంటాడు అనుకున్న ఇమ్మూ టాప్ 4గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. మరి ఇమ్మూనీ ఎలిమినేట్ చేసిన స్టార్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే….

ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్

ఇమ్మాన్యుయేల్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచీ అదరగొట్టాడు. టాస్క్ అంటే చాలు విన్ అవ్వడానికే అన్నట్టుగా రెచ్చిపోయి ఆడే ఇమ్మూ, మామూలు టైమ్ లో అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేశాడు ఆడియన్స్ ను. తను నవ్వుతూ ఆడియన్స్ ను నవ్విస్తూ బిగ్ బాస్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు. ఆడుతూ పాడుతూ హౌస్ మేట్స్ కి నామినేషన్ పాయింట్స్ ఇవ్వకుండా 10వ వారం దాకా వచ్చాడు. దీంతో 3 సార్లు కెప్టెన్సీ పొందిన కంటెస్టెంట్ గా, ఎక్కువ వారాలు ఎలిమినేట్ కాని కంటెస్టెంట్ గా చరిత్రను క్రియేట్ చేశాడు. మమ్మాను కాపాడుకుంటూ, మన అనుకున్న వాళ్ళ కోసం కెప్టెన్సీని సైతం తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. అన్ని రకాలుగా ఈ సీజన్లో బెస్ట్ అనిపించుకున్న ఇమ్మూ కనీసం టాప్ 2లో కూడా లేకపోవడం షాకింగ్. ఎప్పటిలాగే కమెడియన్ కప్ కొట్టలేడు అనే సెంటిమెంట్ మరోసారి నిజమైంది. ఇక హౌస్ లోకి నవీన్ పోలిశెట్టి రోబోను పంపి, ఇమ్మూని బయటకు తీసుకొచ్చాడు. నవీన్ – మీనాక్షీ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడతారో అనే ఆలోచనతో రోగ్ అనే రోబో డాగ్ ను లోపలికి పంపారు.

రోగ్ తో ఎలిమినేషన్ ప్రాసెస్ 

Advertisement

ముందుగా రోబో లోపలికి వెళ్ళి అందరినీ పలకరించింది. ఫెంటాస్టిక్ ఫోర్ టెర్రిఫిక్ త్రీ కాబోతున్నారు అంటూ ‘అనగనగా ఒక రాజు’ టీం ఎంట్రీ ఇచ్చారు. నవీన్ పోలిశెట్టి అడిగిన ప్రశ్నలకు రోబో సమాధానం ఇచ్చింది. తరువాత గార్డెన్ ఏరియాలోకి పిలిపించి, వరుసగా నిలబెట్టారు. రోగ్ ఎవరు ఎలిమినేట్ అయితే వాళ్ళ దగ్గర ఆగుతుంది. అది ఇమ్మూ దగ్గర ఆగి షాక్ ఇచ్చింది. మీ ముగ్గురిలో ఎవరు విన్ అయినా ఓకే అంటూ బైబై చెప్పేశాడు ఇమ్మూ. “బిగ్ బాస్ చాలా నేర్పింది. చాలా వదులుకుని వచ్చాను” అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఇమ్మూతల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యాడు.

Read Also : కప్పు కొట్టేసిన కామనర్ కళ్యాణ్… ప్రైజ్ మనీ 50 లక్షలు కాదు… విన్నర్ కు దక్కేవి ఇవే

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×