Amazon Prime Video Series : ఈ వారం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది ఒక కొత్త సిరీస్. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మా-బెహన్’ ఇప్పటికీ టాప్‌లో ఉన్నా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం ఏడు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ హల్‌చల్ చేస్తోంది. ఆ సిరీస్ పేరు మరేంటో కాదు ‘ది పిరమిడ్ స్కీమ్’ (The Pyramid Scheme). జూన్ 5న విడుదలైన ఈ సస్పెన్స్-కామెడీ డ్రామా ఇప్పటికే చాలా మంది హృదయాలు గెలుచుకుంది. అయితే సీజన్ 1తో సరిపెట్టుకోలేదు మేకర్స్. సీజన్ 2 కూడా వస్తుందనే హింట్ తో ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. మరి సీజన్ 2 కు దారి తీసిన ఆ ఎండింగ్ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
గోల్డీ అనే యువకుడు ఒక సాధారణ అబ్బాయి. అతను ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో చిక్కుకుపోతాడు. మొదట్లో డబ్బు సంపాదించాలనే ఆశతో అడుగు పెడతాడు. కానీ నెమ్మదిగా అది పిరమిడ్ స్కీమ్ అని తెలుస్తుంది. ఒక్కడు పైకి ఎక్కితే కింద ఉన్నవాళ్లు చిక్కుకుపోయే ఆ వ్యవస్థ ఎలా పని చేస్తుందో, ఎలా ప్రజల డబ్బు దోచుకుంటుందో చాలా రియల్ గా, కామెడీ మిక్స్ చేసి చూపించారు. నేటి కాలంలో దాదాపు ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఏదో ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ లో చిక్కుకుని డబ్బు కోల్పోతున్నారు. ఆ వాస్తవాన్ని ఈ సిరీస్ ధైర్యంగా ఎండగట్టింది. కామెడీ టైమింగ్ బాగుంది, సస్పెన్స్ కూడా బాగా ఉంది. చూస్తుంటే నవ్వు వస్తుంది, అదే సమయంలో ఆలోచింపజేస్తుంది.
సిరీస్ చివరి ఎపిసోడ్‌లో గోల్డీ పెళ్లి అయిపోయాక ఒక పార్సెల్ అందుతుంది. దాన్ని తెరిచి చూసి అతను భయంకరమైన చిరునవ్వు నవ్వడంతో సీజన్ 1 ముగుస్తుంది. ఆ సీన్ చూసిన వాళ్లంతా “సీజన్ 2 ఖాయం” అని అనుకుంటున్నారు. మేకర్స్ కూడా రెండో సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
Also Read : ఓటీటీలో దుమ్మురేపుతున్న 2500 కోట్ల హర్రర్ థ్రిల్లర్… ఇంకా చూడలేదా ?
పరంవీర్ చీమా ‘గోల్డీ’ పాత్రలో చాలా నేచురల్‌గా నటించాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ బాగున్నాయి. రణ్‌వీర్ షోరే ‘మనోజ్ శ్రీవాస్తవ’గా బాగా ఆకట్టుకున్నాడు. ఇంకా శేఖర్ సుమన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి సీనియర్ నటులు కూడా తమ పాత్రలకు బలం చేకూర్చారు. అందరి నటన కలిపి సిరీస్‌ను మరింత ఆసక్తికరం చేసింది.TVF నిర్మించిన ఈ సిరీస్ నెట్‌వర్క్ మార్కెటింగ్ మోసాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లకు, కామెడీ + సస్పెన్స్ కావాలనుకునే వాళ్లకు పర్ఫెక్ట్. సిరీస్ ఏడు ఎపిసోడ్ లు మాత్రమే కాబట్టి ఒక్కసారిలోనే ముగించేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతోంది. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. డబ్బు సంపాదన పేరుతో జరిగే మోసాల గురించి ఓ హెచ్చరికలా ఉంటుంది ఈ సిరీస్.