E-Paper
Advertisement

ఓటీటీలో దుమ్మురేపుతున్న 2500 కోట్ల హర్రర్ థ్రిల్లర్… ఇంకా చూడలేదా ?

ఓటీటీలో దుమ్మురేపుతున్న 2500 కోట్ల హర్రర్ థ్రిల్లర్… ఇంకా చూడలేదా ?
Advertisement

Horror Movie on Netflix : ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఓ హర్రర్ మూవీ దుమ్మురేపుతోంది. ‘ది నన్ II’ (The Nun II) అనే హారర్ సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మూడు సంవత్సరాల క్రితం థియేటర్లలోకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఇంట్లో కూర్చుని చూసే వాళ్లకు కూడా గగుర్పాటు పుట్టిస్తోంది. ఈ సినిమా 2023లో విడుదలైంది. ‘ది కంజ్యూరింగ్’ యూనివర్స్‌లో భాగం. మొదటి ‘ది నన్’ చిత్రానికి సీక్వెల్ ఇది. దర్శకుడు మైఖేల్ చావెజ్. టైస్సా ఫార్మిగా (సిస్టర్ ఐరీన్) మళ్లీ తన రోల్ చేసింది. ఆమెతో పాటు స్టార్మ్ రీడ్ కొత్త సిస్టర్ పాత్రను పోషించింది. ఇద్దరూ కలిసి ఈసారి భయంకరమైన రాక్షస శక్తిని ఎదుర్కొనాల్సి వస్తుంది.

కథలోకి వెళ్తే…

మొదటి సినిమా జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత కథ మొదలవుతుంది. ఐరోపా అంతా ఫాదర్లు భయంకరంగా మర్డర్ అవుతుంటారు. దీని వెనకున్న రహస్యాలు బయట పెట్టడానికి వాటికన్ నుంచి సిస్టర్ ఐరీన్‌ ను పంపుతారు. ఆమెతో మరో యంగ్ సిస్టర్ డెబ్రా కూడా వస్తుంది. వాళ్లు ఒక ప్రశాంతమైన కాన్వెంట్‌ కు వెళ్తారు. అక్కడ జరిగే సన్నివేశాలు చూస్తే గుండె ఆగిపోయేలా ఉంటాయి. రాత్రి సమయంలో వచ్చే ఆ రాక్షసుడి ఇమేజ్, సౌండ్స్, డార్క్ అట్మాస్ఫియర్… ఒక్కసారి చూస్తే మర్చిపోలేం. థియేటర్లలో ఈ సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు కేకలు పెడుతూ, కళ్లు మూసుకుని, భయంతో వణుకుతూ చూశారట. కొన్ని సీన్స్ అంత భయానకంగా ఉంటాయి. థియేటర్లలోనే అలా ఉంటే.. ఇక ఇంట్లో ఒంటరిగా చూస్తే ఇంకా భయం రెట్టింపు అవుతుంది. లైట్లు ఆర్పేసి, సౌండ్ పెంచి చూస్తే పక్కా గుండె జారిపోతుంది. మరి ఆ రాక్షసుడిని సిస్టర్ ఎలా ఎదుర్కొన్నారు ? పాస్టర్ల హత్యకు కారణం ఎవరు ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిన కథ.

Advertisement

Also Read : ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో… ప్రియుడి ఎంట్రీతో బుర్రపాడు షాక్

బాక్సాఫీస్ మ్యాజిక్

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 269 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ రూపీస్ లో సుమారు 2,572 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా. బడ్జెట్‌ తో పోలిస్తే సూపర్ హిట్. హారర్ ఫ్యాన్స్‌కు ఇది పండగే అయింది. మూడేళ్ల తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసరికి మళ్లీ హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.ఈ సినిమాలో హారర్ మూడు రకాలు ఉన్నాయి. జంప్ స్కేర్స్, డార్క్ వైబ్స్, సైకలాజికల్ ఫియర్. కథ కూడా బాగా బలంగా ఉంది. నన్స్ దుస్తులు, పాత కాన్వెంట్, రెయిన్, డార్క్ కారిడార్లు… ఎవరైనా భయపడేలా చేస్తాయి. ఈ సినిమాను చూసిన తర్వాత రాత్రి నిద్ర పట్టదు అని చాలా మంది చెప్పేమాట. మొత్తం మీద ‘ది నన్ II’ భయం, ఉత్కంఠ, ఆశ్చర్యం, భయం అన్నీ కలిపి ఇచ్చే సినిమా. మీరు హారర్ లవర్ అయితే తప్పకుండా చూడండి. కానీ ఒంటరిగా చూడకండి.

Advertisement

 

Tags

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×