E-Paper
Advertisement

The RajaSaab: రాజాసాబ్ ఓటీటీ డీల్ క్లోజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

The RajaSaab: రాజాసాబ్ ఓటీటీ డీల్ క్లోజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

The RajaSaab:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ప్రభాస్ (Prabhas). తెలుగులోనే కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ఈయన అక్కడ హిందీలో కూడా మార్కెట్ భారీగా పెంచుకొని తన సినిమాలతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఒక్కప్పుడు ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచిన కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చేవి.. కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా సరే. కంటెంట్ బాగుంటేనే సినిమాలు చూడడానికి థియేటర్ కు వెళ్తున్నారు ఆడియన్స్.. ఈ క్రమంలోనే ఆది పురుష్ తర్వాత అంతటి నష్టాలను మిగిల్చిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఇటీవల విడుదలైన ది రాజాసాబ్.

ఓటీటీ డీల్ క్లోజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం. జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయినా సరే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ భారీగా సాధించింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అసలు నష్టం తెలిసి అభిమానులు కూడా నోరెళ్ళ పెడుతున్నారు. మరోవైపు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ సుమారుగా 80 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. అంతేకాదు ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

ఫైనల్ రన్ ముగించుకున్న రాజాసాబ్.. లాభమా? నష్టమా?

Advertisement

ఇకపోతే హారర్ ఫాంటసీ డ్రామాగా సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లోనే థియేటర్ క్లోజింగ్ కి వచ్చేసింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటి వారంలోనే 130 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా.. ఇప్పటివరకు టోటల్ ఇండియా వైడ్ నెట్ కలెక్షన్స్ 142 కోట్లకు చేరుకుంది. అటు గ్రాస్ పరంగా చూసుకుంటే మొదటి వారంలో 238 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ మొత్తంగా చూసుకుంటే 250 కోట్ల గ్రాస్ మార్కు టచ్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ బిజినెస్ లెక్కలు, రాజా సాబ్ బడ్జెట్ చూసుకుంటే మాత్రం ఈ చిత్రానికి భారీగానే నష్టాలు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా థియేటర్ వెర్షన్ 50 నుంచి 60 శాతం రికవరీ చేసినప్పటికీ ..సుమారుగా 100 కోట్ల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇకపోతే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన మారుతి ఫ్లాప్ రూపంలో గట్టి గిఫ్ట్ ఇచ్చాడని సోషల్ మీడియా వేదికగా మారుతీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్!

ALSO READ:Disha Patani: అతడితో డేటింగ్ లో దిశాపటానీ.. ఎవరో తెలిస్తే షాక్!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×