OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నచ్చిన సినిమాలను, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. అయితే హాలీవుడ్ సినిమాలకు, ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రత్యేకమైన ఫాలోవర్స్ ఉన్నారు. 2022 లో వచ్చిన ఒక హాలీవుడ్ లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ లవ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది రాయల్ ట్రీట్‌మెంట్‘ (The Royal Treatment). 2022 లో రిలీజ్ అయిన ఈ మూవీకి రిక్ జాకబ్సన్ దర్శకత్వం వహించారు. ఒక సాధారణ అమ్మాయిని యువరాజు ప్రేమించడంతో, ఇద్దరి మధ్య ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ విమర్శకుల నుండి మిశ్రమ ప్రశంసలు అందుకుంది. మస్సౌద్, మరానో, జే సైమన్, పాల్ నోరెల్ ఇందులో నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక సెలూన్ షాప్ నడుపుతూ ఉంటుంది. ఇద్దరమ్మాయిలను పెట్టుకొని నడిపిస్తున్నఈ సెలూన్, అంతంతమాత్రంగానే సాగుతుంటుంది. అయితే మరోవైపు ఒక దీవిలో రాయల్ ఫ్యామిలీ ఉంటుంది. అందులో యువరాజుకు కటింగ్ కోసం అతని మేనేజర్ హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఈ ఆఫర్ రావడంతో హీరోయిన్ గంతు వేస్తుంది. రాయల్ ఫ్యామిలీ కావడంతో డబ్బులు కూడా మంచిగా ఇస్తారు అనుకుంటుంది. అక్కడికి వెళ్లిన హీరోయిన్ పని మనుషులను సరిగ్గా చూసుకోకపోవడంతో, యువరాజుకు కటింగ్ చేయకుండానే వచ్చేస్తుంది. ఆ తర్వాత యువరాజు ఆమె సెలూన్ కు వచ్చి, సారీ చెప్పి హీరోయిన్ తో కటింగ్ చేయించుకుంటాడు. అలా వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కుదురుతుంది. యువరాజుకి, మరో యువరాణికి తొందర్లో ఎంగేజ్మెంట్ కు ఏర్పాటు చేస్తారు కుటుంబ సభ్యులు. అయితే ఇందుకు వచ్చే అతిధులకు మంచి హెయిర్ స్టైల్ ఇవ్వడానికి, అందంగా తయ్యారు చేయడానికి హీరోయిన్ ను పిలిపిస్తారు.
ఆ మహల్ కి హీరోయిన్ తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా వస్తారు. అక్కడ హీరోయిన్ చేసే హెయిర్ స్టైల్ కి అందరూ ఫిదా అవుతారు. ఈ క్రమంలోనే యువరాజు, హీరోయిన్ ప్రేమలో పడతాడు. ఆ దీవిలో ఉన్న పేద పిల్లలకు ఏదైనా సహాయం చేయాలనుకుంటుంది హీరోయిన్. అందుకుగాను కొన్ని పాంప్లెట్స్ పంచి, అనాధ పిల్లలకి సహాయం చేయాలని అడుగుతుంది. మరోవైపు యువరాజు పెళ్లికి సిద్ధపడుతూ ఉంటాడు. చివరికి యువరాజు పెళ్లి ఎవరితో జరుగుతుంది? ఆ దీవిలో హీరోయిన్ అనాధ పిల్లలకి సాయం చేస్తుందా? హీరోయిన్ సెలూన్ చివరికి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది రాయల్ ట్రీట్‌మెంట్’ (The Royal Treatment) అనే ఈ లవ్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.