BigTV English

Horoscope  Today January 19th: ఆ రాశి వారికి ఈరోజు నూతన వాహనయోగం ఉంది

Horoscope  Today January 19th: ఆ రాశి వారికి ఈరోజు నూతన వాహనయోగం ఉంది

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 19న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు పితృ వర్గీయులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిష్టంభన కలుగుతాయి. రెండు రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు.

వృషభ రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇతరుల పై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు.


మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో ప్రయత్న కార్యసిద్ధి  కలుగుతుంది.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కన్యా రాశి : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు  స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు  లోటు ఉండదు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్నిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూరప్రయాణ సూచనలున్నవి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు  వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.  ముఖ్యమైన పనులు సమయానికి పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Samantha: సమంత పూజిస్తున్న ఈ అమ్మవారు ఎవరో తెలుసా? ఈ దేవత ఎంత శక్తిమంతురాలంటే ?

Temple mystery: గుడి తలుపులు మూసేసిన వెంటనే వింత శబ్దాలు..! దేవతల మాటలా? అర్థం కాని మాయాజాలం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?

Diwali 2025: దీపావళికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం !

Hasanamba temple: దీపావళి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఏడాది పాటు ఆరని దీపం!

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Big Stories

×