Coolie: ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ పైన ఉన్న నమ్మకం, అంతేకాకుండా పలు ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు అందరూ ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అన్నిటిని మించి ఈ సినిమాకి అనిరుద్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రజనీకాంత్ సినిమా అంటేనే అనిరుద్ రెచ్చిపోతాడు. ఇప్పటివరకు రజనీకాంత్ సినిమాలకు అనిరుద్ ప్రతిసారి న్యాయం చేశాడు. కూలీ సినిమా కూడా అదే విధంగా పనిచేశాడు.
ఎవరా క్రియేటివ్ జీనియస్.?
మామూలుగా తెలుగు సినిమాలకు సంబంధించి ఒక సినిమా రిలీజ్ ముందు ఈవెంట్ జరగడం అనేది కామన్ గా జరుగుతుంది. అయితే ఆ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. కానీ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు దానిని లైవ్ టెలికాస్ట్ చేయరు. ఈవెంట్ కూడా ప్రాపర్ గా డిజైన్ చేసి దానిని సినిమా రిలీజ్ కంటే ముందు రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా సన్ నెట్వర్క్ నిర్మించే సినిమాలైతే ప్రోపర్ గా ప్లాన్ చేస్తారు. కూలీ సినిమాకి సంబంధించిన తమిళ్ ఈవెంట్ నిన్న టెలికాస్ట్ అయింది. అయితే తెలుగు ఈవెంట్ మాత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 14న సినిమా విడుదల అయితే ఆగస్టు 15న ఎందుకు తెలుగు ఈవెంట్ ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం దీనిపైన సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత ఈవెంట్ వేస్తున్నారు అంటే దీని వెనక ఉన్న క్రియేటివ్ జీనియస్ ఎవరు అని కామెంట్స్ చేస్తున్నారు.
భారీ అంచనాలు
ఇక కూలీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి స్టార్డం ఉన్న నాగార్జున ఈ సినిమాలో విలన్ రోల్ చేశారు. ఒక హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తి విలన్ పాత్ర వేశారు అంటే ఆ కథలో ఎంత ప్రాముఖ్యత ఉండి ఉంటుందో అని చాలామంది అభిప్రాయం. అంతేకాకుండా ఎంతమంది స్టార్లు ఉన్నా కూడా వాళ్లను లోకేష్ కూడా అద్భుతంగా డీల్ చేస్తాడు అనడానికి నిదర్శనం విక్రమ్ సినిమా. విక్రమ్ సినిమా తర్వాత అంతమంది స్టార్లు ఈ సినిమాలోనే కనిపిస్తున్నారు. సో ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
Also Read: Harish Shankar: త్రివిక్రమ్ కాంపౌండ్ లో హరీష్ శంకర్, టైం ఎలా చేంజ్ అయిందో