Cancer Risk: క్యాన్సర్ ఎవరికైనా వస్తుందని అందుకే దీనిని నివారించేందుకు నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసుల దృష్ట్యా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఎవరికి ఉంది, మగ లేదా ఆడ? అనే ప్రశ్న ప్రజల మదిలో మళ్లీ మళ్లీ తలెత్తుతుంటాయి.
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షల మంది చనిపోతున్నారు. పురుషులు, మహిళలు లేదా పిల్లలు , ఇలా అన్ని వయసుల వారిలో క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయి. రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణమైన కేసులు అయితే ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ పురుషులలో అత్యంత సాధారణ కేసులు. వీటి కారణంగా మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పిల్లలు కూడా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. లుకేమియా, మెదడు ,వెన్నెముక క్యాన్సర్ పిల్లలలో కనిపించే అత్యంత సాధారణ రకాల క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నక్యాన్సర్ కేసుల దృష్ట్యా అసలు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేన్సర్ ముప్పు మహిళల్లోనే ఎక్కువగా ఉందని, పురుషుల కంటే మహిళలే ఈ తీవ్రమైన వ్యాధి బారిన పడుతున్నారని తేలింది . అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఒక నివేదికలో 50 ఏళ్లలోపు 17 మంది మహిళల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. పురుషులలో ఈ రేటు 29 మందిలో ఒకరు.
మీ వయసు పెరిగే కొద్దీ ఈ తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని క్యాన్సర్ నిపుణులు అంటున్నారు.
క్యాన్సర్ మరణాల రేటు తగ్గింపు:
వైద్య రంగంలోని ఆవిష్కరణలు, సమర్థవంతమైన చికిత్స, ఔషధాల కారణంగా, క్యాన్సర్ మరణాల రేటు ఖచ్చితంగా తగ్గిందని, అయితే ఇది ఇప్పటికీ పెద్ద ప్రమాదంగా ఉందని అధ్యయన నివేదిక ద్వారా రుజువైంది. 1991,2022 మధ్య క్యాన్సర్ సంబంధిత మరణాలలో 34% క్షీణత ఉందని ఈ నివేదికలో ప్రస్తావించబడింది
యునైటెడ్ స్టేట్స్‌లో గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్ ఇప్పటికీ మరణాలకు రెండవ ప్రధాన కారణం. పురుషుల కంటే 65 ఏళ్లలోపు మహిళలు ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తేలింది. ఇది మాత్రమే కాదు, అనేక ఇతర రకాల క్యాన్సర్లు (మహిళల్లో నోటి క్యాన్సర్ , గర్భాశయం, కాలేయ క్యాన్సర్) మునుపటి కంటే ఎక్కువ మందిని చంపుతున్నాయి.
భారతదేశంలో క్యాన్సర్ నిర్ధారణ, ముప్పు:
భారతీయ జనాభాలో క్యాన్సర్‌ను నివారించడంలో , దాని మరణాల రేటును తగ్గించడంలో గొప్ప విజయం సాధించారు. 2024 చివరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా క్యాన్సర్‌కు సంబంధించి చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ది లాన్సెట్ అధ్యయన నివేదికను ప్రస్తావిస్తూ ఇప్పుడు భారతదేశంలో ఈ వ్యాధికి చికిత్స ప్రారంభించే అవకాశం మునుపటితో పోలిస్తే చాలా పెరిగిందని ఈ వ్యాధి కారణంగా మరణాల రేటును తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
Also Read: ఇవి తింటే.. వృద్దాప్యంలోనూ కంటి సమస్యలు రావు
క్యాన్సర్ చికిత్సను సులభతరం చేయడంలో ఆయుష్మాన్ భారత్ పథకం పాత్ర కూడా చాలా ముఖ్యమైనదని ప్రధాన మంత్రి అన్నారు. దీని సాయంతో 90 శాతం మంది క్యాన్సర్ రోగులకు సకాలంలో వైద్యం అందుతోంది. ఆయుష్మాన్ భారత్ యోజన క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ఖర్చుల ఒత్తిడిని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు ప్రజలు చికిత్స గురించి మునుపటి కంటే చాలా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు.