BigTV English

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : కామెడీ-డ్రామా వెబ్ సిరీస్‌లు, ఫ్యామిలీ మొత్తం కలసి చూసే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ‘జంబలకడి పంబ’ సినిమాని గుర్తుకు చేస్తుంది. ఇందులో ఒక్కసారిగా అమ్మాయి, అబ్బాయిల పరిస్థితి మారిపోతుంది. రిఫ్రెషింగ్ సిరీస్ గా దీనిని చెప్పుకోవచ్చు. సరదా సన్నివేశాలతో మీ మూడ్ ని ఈ సిరీస్ మార్చేస్తుంది. ఈ హిందీ వెబ్ సిరీస్, Y-Films నిర్మించిన తొలి ఒరిజినల్ సిరీస్. ఈ సిరీస్ ఎక్కడ చూడొచ్చు? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

ఈ కథ కిరణ్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను సమాజంలో స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, పురుషులు అన్యాయంగా నిర్లక్ష్యం చేయబడుతున్నారని ఫీలవుతుంటాడు.


ఎపిసోడ్ 1: కిరణ్ ఒక సాధారణ ఆఫీస్ ఉద్యోగి. తన స్నేహితుడు కునాల్ తో కలిసి సమాజంలో స్త్రీలకు ఎక్కువ ఫేవర్ ఉందని ఫిర్యాదు చేస్తాడు. అతని తల్లిదండ్రులు కూడా ఈ అసమానత గురించి వాదిస్తారు. కిరణ్ “స్త్రీలు ఎందుకు ఇంత స్పెషల్ ట్రీట్‌మెంట్ పొందుతారు?” అని సరదాగా కోపంగా అనుకుంటూ, ప్రపంచం మారిపోవాలని కోరుకుంటాడు. అతని కోరిక నిజమవుతుంది. ఒక్కసారిగా ప్రపంచం మారిపోతుంది. స్త్రీలు ఇప్పుడు ఆఫీస్‌లో బాస్‌లుగా ఉంటారు. బస్సుల్లో పురుషులను ఈవ్-టీజ్ చేస్తారు. కిరణ్ ఈ సంఘటనలను చూసి మరింత షాక్ అవుతాడు.

ఎపిసోడ్ 2: కిరణ్ ఆఫీస్‌లో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తాడు. కానీ అతని బాస్ గాయత్రి, అతన్ని అవమానిస్తుంది. పురుషులు ఇలాంటి పెద్ద జాబ్‌లకు సరిపోరు అని అనుకుంటుంది. బస్సులో ఇతర స్త్రీలు కిరణ్‌ను ఈవ్-టీజ్ చేస్తారు. “ఏయ్, కిరణ్, ఎంత క్యూట్‌గా ఉన్నావు!” అని సరదాగా కామెంట్స్ చేస్తారు. కిరణ్, “ఇది ఏమిటి, నేను ఇలా ఫీల్ అవ్వడం ఎలా?” అని గందరగోళంలో ఉంటాడు. అతని స్నేహితుడు కునాల్ కూడా ఈ కొత్త ప్రపంచంలో ఇబ్బంది పడతాడు. ఇప్పుడు కిరణ్, “ఈ ప్రపంచం ఇంత కష్టమా?” అని ఆలోచిస్తాడు.

ఎపిసోడ్ 3: కిరణ్ ఈ కొత్త ప్రపంచంలో స్త్రీల ఆధిపత్యంతో విసిగిపోతాడు. అతను బస్సులో హరాస్‌మెంట్‌కు గురవుతాడు. ఆఫీస్‌లో కూడా ఇబ్బందులు పడతాడు. అతను తన తల్లితో, అలాగే స్నేహితురాలు ఆగ్యతో మాట్లాడుతాడు. కానీ వారు కూడా ఈ కొత్త ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తారు.

ఎపిసోడ్ 4: సీజన్ ఫినాలేలో, కిరణ్‌కు తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేస్తారు. అతను స్త్రీలు గతంలో ఎదుర్కొన్న అన్యాయాలను అర్థం చేసుకుంటాడు. ఒక డాక్టర్, పోలీస్ ఇన్స్పెక్టర్ కిరణ్‌ను అవమానిస్తారు. చివరకు కిరణ్ తన ప్రార్థనను రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. కానీ కిరణ్ ఇప్పుడు స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకుని, “నేను ఇకపై అలా ఉండను!” అని ఒక మంచి వ్యక్తిగా మారాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఈ సిరీస్ సుఖాంతంతో ముగుస్తుంది. కిరణ్ తన స్నేహితుడు కునాల్‌తో కలిసి, జెండర్ ఈక్వాలిటీ కోసం పనిచేయాలని ప్రతిజ్ఞ చేస్తాడు.

Read Also : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే … 

ఎందులో ఉందంటే

‘Man’s World’ కామెడీ వెబ్ సిరీస్ Y-Films యూట్యూబ్ ఛానల్‌లో విడుదలైంది. విక్రమ్ గుప్తా దీనికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం YouTube, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. నిడివి 4 ఎపిసోడ్‌లు (15-20 నిమిషాలు, మొత్తం 64 నిమిషాలు) హిందీ భాషలో, తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. ఇందులో గౌరవ్ పాండే (కిరణ్), గుర్ప్రీత్ సైని (కునాల్), నివేదిత శుక్లా (గాయత్రి), రామకాంత్ దయామా (కిరణ్ తండ్రి), రోంజిని చక్రవర్తి (చాయ), సిల్కీ ఖన్నా (కిరణ్ తల్లి), శిఖా తల్సానియా (ఆగ్య), భూమి పెడ్నేకర్ (మిసాండ్రిస్ట్), పరిణీతి చోప్రా (డాక్టర్), రిచా చడ్డా (పోలీస్ ఇన్స్పెక్టర్), కల్కి కోచ్లిన్ (ప్రమోషన్ అనౌన్సర్), రియా చక్రవర్తి (బీనా), ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో దీనికి 7.2/10 రేటింగ్‌ కూడా ఉంది.

Related News

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×