BigTV English

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Rinku Singh: రక్షా బంధన్.. తోబుట్టువులకు ఓ పవిత్రమైన పండుగ. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా ఈ రక్షాబంధన్ ని జరుపుకుంటారు. ఈ పవిత్ర పండుగ రోజున అక్కా, చెల్లెళ్లు.. సోదరుల చేతికి రాఖీ కడతారు. అనంతరం స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ క్రమంలో సోదరీమణులకు తాము అండగా ఉంటామని అన్నాతమ్ముళ్ళు వాగ్దానం చేస్తారు. కొందరు సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు విలువైన బహుమతులు ఇచ్చి.. వారి పట్ల తమ ప్రేమను చాటుకుంటారు. కొందరు ఈ రక్షాబంధన్ రోజున తమను వీడి వెళ్లిన అన్నదమ్ములను, అక్క చెల్లెల్లలను గుర్తు చేసుకుంటారు.


Also Read: Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

వారు తమతో పాటు ఉండి, తమకు రాఖీ కడితే ఎంతో ఆనందంగా ఉండేదని అనుకుంటారు. కానీ టీమిండియా స్టార్ బ్యాటర్ రికూ సింగ్ మాత్రం తన జీవితాన్ని మార్చేసిన దానికి రాఖీ కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. రింకు సింగ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఐపీఎల్ మ్యాచ్ లో ఒకే ఓవర్ లో ఐదు సిక్స్ లు కొట్టి రాత్రికి రాత్రి హీరోగా మారిపోయిన రింకు సింగ్.. అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఇతడు భారత క్రికెట్ జట్టులో కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ లో కలకత్తా రైడర్స్ జట్టుకు ఆడిన రింకూ.. 2023 లో గుజరాత్ టైటాన్స్ పై ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టి సంచలనం సృష్టించాడు.


దేశీయ క్రికెటర్ లో కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో 2024లో 13 కోట్లకు కేకేఆర్ ఇతడిని రిటైన్ చేసుకుంది. ఇక ఇటీవల ఎంపీ ప్రియా సరోజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా రింకూ సింగ్ షేర్ చేసిన వీడియోలో.. తన బ్యాట్ కి రాఖీ కట్టాడు. అంతేకాకుండా ఈ వీడియోలో అతడు తన బ్యాట్ ని చూస్తూ భావోద్వేగంతో మాట్లాడాడు. రింకు షేర్ చేసిన ఈ వీడియోలో.. “నీవల్లే నా కెరీర్ మొదలైంది. నీవల్ల నేను ఒక సెలబ్రిటీ అయ్యాను. నీవల్లే నా ప్రతి కల నెరవేరింది. నీవల్ల ఇప్పుడు ఆకాశం కూడా చిన్నదిగా అనిపిస్తుంది. ఆ ఐదు సిక్సర్ల వల్ల నా జీవితం ఓ అందమైన ప్రయాణంగా మారింది. హ్యాపీ రక్షా బంధన్” అని చెప్పిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

Also Read: Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. 2023 ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 13వ మ్యాచ్ లో.. గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అయితే కేకేఆర్ జట్టు లక్ష్య చేదనలో చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో గుజరాత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ రింకూ సింగ్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. చివరి ఓవర్ గుజరాత్ బౌలర్ యష్ దయాల్ వేశాడు. అప్పుడు రెండవ బంతికి స్ట్రైక్ లోకి వచ్చిన రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఆ ఐదు బంతుల్లో వరుసగా ఐదు సిక్సులు కొట్టి జట్టును మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. ఇప్పుడు అదే బ్యాట్ కి రాఖీ కట్టిన వీడియోని షేర్ చేశాడు.

?utm_source=ig_web_copy_link

Related News

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ధైర్యం చెబుతున్న అభిమానులు

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Big Stories

×