E-Paper
Advertisement

BSNL vs Vodafone: ఒకే ధరలో రెండు రీఛార్జ్ ప్లాన్స్.. బీఎస్‌ఎన్‌ఎల్ vs వొడాఫోన్.. ఏది బెస్ట్?

BSNL vs Vodafone: ఒకే ధరలో రెండు రీఛార్జ్ ప్లాన్స్.. బీఎస్‌ఎన్‌ఎల్ vs వొడాఫోన్.. ఏది బెస్ట్?
Advertisement

BSNL vs Vodafone| టెలికాం దిగ్గజాలు బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ ఇండియా (వీఐ) రెండూ ఒకే ధరతో రెండు వేర్వేరు ప్లాన్ అందిస్తు్ అనేక ప్రీపేయిడ్ ప్లాన్‌లు ఆఫర్ చేస్తున్నాయి. రెండు కంపెనీలు కూడా రూ.2399 ప్లాన్‌ ఆఫర్ చేస్తున్నాయి. కానీ ధర ఒక్కటే అయినా బెనిఫిట్స్ చాలా భిన్నంగా ఉన్నాయి. ఇందేలో ఒక్క రిఛార్జ్ మొత్తం మాత్రమే సమానం కానీ.. రెండు ప్లాన్స్ వేర్వేరు వివరాలు చూద్దాం.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2399 ప్లాన్ ఏమిటి, దాని బెనిఫిట్స్ ఏమిటి?

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2399 ప్లాన్ పూర్తి 365 రోజుల వాలిడిటీ ఇస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 2GB డేటా ఉంది. రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. మొత్తం సంవత్సరానికి 730GB డేటా వస్తుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 40Kbpsకి తగ్గుతుంది. ఇది భారత్‌లో రోజుకు 2GB డేటాతో వచ్చే చవకైన 365 రోజుల ప్లాన్. రోజువారీ ఖర్చు కేవలం రూ.6.57 మాత్రమే. తరచూ రీచార్జ్ చేయడం ఇష్టం లేని వారికి ఇది బెస్ట్.

వీఐ రూ.2399 ప్లాన్ ఏమిటి, దాని బెనిఫిట్స్?

Advertisement

వీఐ రూ.2399 ప్లాన్ కేవలం 180 రోజుల వాలిడిటీ ఇస్తుంది. రోజువారీ ఖర్చు దాదాపు రూ.13.32. ఇది బీఎస్‌ఎన్‌ఎల్ కంటే దాదాపు డబుల్. అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి. రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. ఆరు నెలలకు మొత్తం 270GB డేటా వస్తుంది. రోజువారీ లిమిట్ అయిపోయిన తర్వాత స్పీడ్ 64Kbpsకి తగ్గుతుంది.

వీఐ ప్లాన్‌లో అదనపు డేటా బెనిఫిట్స్ ఏమిటి?
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్ ఉంది. 5G హ్యాండ్‌సెట్, 5G కవరేజ్ ఏరియాలో ఉంటే ఇది ఉచితం. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్రీ నైట్ డేటా లభిస్తుంది. వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ఫీచర్ ఉంది. డేటా డిలైట్ బెనిఫిట్ కూడా ఉంది.

Advertisement

Also Read: రూ.100 కంటే తక్కువలో జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 30 రోజుల వాలిడిటితో సూపర్ బెనిఫిట్స్

వీఐ ప్లాన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పెర్క్స్ ఏమిటి?

సబ్‌స్క్రైబర్లకు వీఐ మూవీస్ అండ్ టీవీ సూపర్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇది 180 రోజులు ఉంటుంది. 19 OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ ఇస్తుంది. సోనీలివ్, జీ5, ఫ్యాన్‌కోడ్ వంటివి ఇందులో ఉన్నాయి. టీవీ మరియు మొబైల్ రెండింటిలోనూ చూడవచ్చు.

ఏ ప్లాన్ బెటర్ అని ఎంచుకోవాలి?

రెండు ప్లాన్‌ల ధర ఒక్కటే రూ.2399. కానీ రూపొందించిన విధానం భిన్నమైన కస్టమర్ అవసరాలకు సరిపడుతుంది. ఎక్కవ కాలం వాలిడిటీ, తక్కువ రోజువారీ ఖర్చు కావాలంటే బీఎస్‌ఎన్‌ఎల్ ఎంచుకోండి. తరచూ రీచార్జ్ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే ఇది బెస్ట్. మరింత డేటా బెనిఫిట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే వీఐ ఎంచుకోండి. 5G డేటా మరియు OTT బండిల్స్ గణనీయమైన వాల్యూ జోడిస్తాయి. మీ వ్యక్తిగత ఉపయోగం ఆధారంగా నిర్ణయం తీసుకోండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×