E-Paper
Advertisement

Horror Movie OTT : సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసిన కామెడీ హారర్ మూవీ.. చూస్తే పడి పడి నవ్వేస్తారు..

Horror Movie OTT : సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసిన కామెడీ హారర్ మూవీ.. చూస్తే పడి పడి నవ్వేస్తారు..
Advertisement

Horror Movie OTT : ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీలోకి వచ్చి భారీ వ్యూస్ ను అందుకుంటున్నాయి.. లవ్ రొమాంటిక్ కథలతో వస్తున్నా సినిమాల కన్నా కూడా హారర్ కామెడీ చిత్రాలకు ఎక్కువగా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలే ఎక్కువగా హారర్,సస్పెన్స్ మూవీలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో ఓటీటీలో ఎక్కువ సంఖ్యలో ఓటీటీలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా మరో హారర్ కామెడీ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే స్త్రీ 2.. ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ హారర్ మూవీ.. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఆ వివరాలు ఒకసారి చూసేద్దాం రండి..

ఇటీవల బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ కామెడీ సినిమా స్త్రీ 2. ఇకపోతే 2018 లో వచ్చిన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా ‘స్త్రీ 2 : సర్కటే కా ఆటంక్’ అనే టైటిల్‌తో ఆగస్ట్ 15న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన తో పాటుగా బాక్సఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన స్త్రీ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 851.03 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది .. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఇంత కలెక్షన్స్ రాబట్టడం విశేషం.. దాంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో మెరిశారు..

Advertisement

అయితే థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ మూవీ తాజాగా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, సెప్టెంబర్ 27 నుంచి స్త్రీ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని జోరుగా రూమర్స్ వినిపించాయి. కానీ, ఎలాంటి అధికారిక ప్రకటనే లేకుండానే అనుకున్న తేది కంటే ఒకరోజు ముందే ఇవాళ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో మాత్రమే స్త్రీ 2 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. స్త్రీ 2 సినిమాను చూడాలంటే రూ. 349 చెల్లించి అద్దె ప్రాతిపదికన చూడాల్సిందే. అలాగే, స్త్రీ 2 ప్రస్తుతం కేవలం హిందీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోకి కూడా రాబోతుందని సమాచారం..

ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ స్పెషల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్త్రీ 2 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. స్త్రీ 2 సినిమాను చూడాలంటే రూ. 349 చెల్లించి అద్దె ప్రాతిపదికన చూడాల్సిందే. అలాగే, స్త్రీ 2 ప్రస్తుతం కేవలం హిందీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. థియేటర్ల లో మంచి టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×