BigTV English

Tollywood Hero: డ్రగ్స్ కేసులో హీరో అభిషేక్ అరెస్ట్.. వెలుగులోకి నిజాలు..!

Tollywood Hero: డ్రగ్స్ కేసులో హీరో అభిషేక్ అరెస్ట్.. వెలుగులోకి నిజాలు..!

Tollywood Hero.. డ్రగ్స్ తీసుకోవడం నేరం అంటూ ప్రభుత్వాలు ఎంత చెప్పినా సరే సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ తీసుకుంటూ లేదా అమ్ముతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయినా సరే మరి కొంతమంది బహిరంగంగా ఇలా డ్రగ్స్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక టాలీవుడ్ హీరో ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఆర్ నగర్ ,జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ కేసులో అభిషేక్ (Abhishek)అరెస్టు అయ్యారు.


డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటుడు అభిషేక్..

ఇదిలా ఉండగా తాజాగా కోర్టుకు హాజరుకావాలని నోటీసులు పంపించినా.. ఆయన హాజరు కాకపోవడంతో తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయ్యాయి. దీంతో రాష్ట్రం నుంచి పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి గోవా వెళ్లి అభిషేక్ ను అరెస్టు చేసి, హైదరాబాద్ సిసిఎస్ కు తరలించినట్లు సమాచారం. ఇక అనంతరం అతడిని కోర్టు ముందు హాజరు పరచనున్నారు పోలీసులు. మొత్తానికైతే డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ హీరో ఇరుక్కొని అందరిని ఆశ్చర్యపరిచారని చెప్పవచ్చు.


 

2012 డిసెంబర్ లోనే అరెస్ట్..

ఈ డ్రగ్స్ విషయానికి వస్తే.. 2012 డిసెంబర్ లోనే అభిషేక్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అభిషేక్.. జి. శ్రీనివాసులు అనే వ్యక్తితో స్కోడా కారులో ప్రయాణిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో 10 ప్యాకెట్ల కొకైన్ తో పట్టుబడ్డాడు అభిషేక్. అభిషేక్ తో పాటు నవీన్, శ్రీనివాస్ అలాగే మరో ఇద్దరు నైజీరియన్లతో పాటు మొత్తం ఆరుగురిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేయగా, నిందితులు దక్షిణ ఆఫ్రికా నుంచి ముంబైకి ఈ కొకైన్ తీసుకొచ్చి, అక్కడ నుంచి హైదరాబాదుకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు అభిషేక్ ను మళ్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. దీంతో పలువురు సెలబ్రిటీలు కూడా అభిషేక్ పై, ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభిషేక్ సినిమాలు..

అభిషేక్ సినిమా విషయానికొస్తే.. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిష ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించే విలన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన అభిషేక్ డ్రగ్స్ కేసు నేపథ్యంలోనే సినిమాలకు దూరమయ్యాడు. కెరియర్ సాఫీ గా కొనసాగిస్తున్న సమయంలోనే, ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో సినిమాలలో కూడా అవకాశాలు రాకుండా పోయాయి .
ఏది ఏమైనా డబ్బు సంపాదించాలని, డబ్బు పై వ్యామోహంతో కెరియర్ నే నాశనం చేసుకున్నాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం తప్పించుకుని తిరుగుతున్న అభిషేక్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మరి కోర్టు ముందుకు హాజరు పరచనున్న నేపథ్యం లో కోర్టు ఇతడి పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×