BigTV English
Advertisement

Devara USA Review: దేవర యూఎస్ఏ రివ్యూ.. మ్యాజిక్ చేసిన కొరటాల..!

Devara USA Review: దేవర యూఎస్ఏ రివ్యూ.. మ్యాజిక్ చేసిన కొరటాల..!

Devara USA Review.. ఇటీవల కాలంలో ఆడియన్స్ కొత్త కథలను ఇష్టపడుతున్న నేపథ్యంలో వారి అభిరుచికి తగ్గట్టుగా దర్శకులు కూడా కథలను సిద్ధం చేస్తూ తెరపై భిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో మన సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మన హీరోల నుంచి వచ్చే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తూ.. మంచి గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన రాబోతున్నారు.


యూఎస్ఏ లో దేవరా ప్రీమియర్ షో..

ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు యూఎస్ఏ లో ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమా చూసిన ఆడియన్స్ సినిమా గురించి ఏం చెబుతున్నారు..? అసలు ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారా ? లేదా ? అనే విషయాలు కూడా వారు చెబుతున్నారు. మరి దేవర యూఎస్ఏ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


దేవర కథ..

కథ విషయానికి వస్తే.. వైజాగ్ లో సముద్రం మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని కుటుంబాలను అల్లోకల్లోలం చేయడానికి ఒక వ్యక్తి పూనుకుంటాడు. అయితే ఆ వ్యక్తి కూడా ఆ కుటుంబాలలో నుంచి వచ్చిన వాడే కావడం విశేషం. అతడికి వ్యతిరేకంగా దేవర ప్రజలకు అండగా నిలబడతాడు. మరి ఆ దేవర ను ఎవరు చంపారు.? తన కొడుకు వచ్చి వాళ్ళ మీద రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు..? అనే పాయింట్ తో సినిమానే చాలా అద్భుతంగా తెరకెక్కించారు కొరటాల శివ. మొత్తానికి అయితే ఈ ప్రశ్నలన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

బ్లాక్ బస్టర్ పక్కా..

యూఎస్ఏ ప్రీమియర్ షో రివ్యూ విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నటనతో మరో లెవెల్ అందుకున్నారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వి కపూర్ కూడా తన నటనలో పరిణితిని చూపించింది. ముఖ్యంగా ఈమెలో ఉన్న నటిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొత్తానికి అయితే దేవర సినిమా ఓవరాల్ గా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

కొరటాల శివ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా..?

ఇకపోతే ఈ సినిమాకి అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్ లు కూడా చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలిచిందని, కానీ మ్యూజిక్ కొంతవరకు బాగున్నా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం పెద్దగా అనిరుధ్ ప్రభావాన్ని చూపించలేదని కామెంట్లు చేస్తున్నారు. కొరటాల శివ లాంటి దర్శకుడు ఈసారి కొత్త మేకింగ్ విధానాన్ని అలవర్చుకొని చేసిన సినిమాగా ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తానికైతే కొరటాల శివ ఏదో మ్యాజిక్ చేశాడని, ఎన్టీఆర్ తన స్ట్రాటజీ చూపించి సక్సెస్ అందుకోబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×