E-Paper
Advertisement

OTT Movie: పోలీసులకు హింట్ ఇస్తూ మర్డర్లు… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: పోలీసులకు హింట్ ఇస్తూ మర్డర్లు… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే మినిమం కంటెంట్ ఉంటుంది. పోలీసులు, హత్యలు, రివేంజ్ లతో స్టోరీ పరుగులు పెడుతుంటుంది. ఇలాంటి సినిమాలే ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ కూడా అవుతున్నాయి. ఓటీటీలో కూడా ఎక్కువ భాగం ఆక్రమించిన సినిమాలు కూడా థ్రిల్లర్ జానర్లో వచ్చినవే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, ఒక మిస్టీరియస్ కాలర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి జరగబోయే క్రైమ్స్ ని హింట్ ఇవ్వడం చుట్టూ తిరుగుతుంది. చివరి వరకు ఈ కథ ఇంటెన్స్ గా సాగుతుంది. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేరు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2023లో విడుదలైన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘థీర్కదరిషి’ (Theerkadarishi). పి.జి. మోహన్ & ఎల్.ఆర్. సుందరపాండియన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సత్యరాజ్, అజ్మల్ అమీర్, పూర్ణిమా భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించారు. దాదాపు రెండు గంతల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.5/10 రేటింగ్ పొందింది. 2023 మే 5న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ తమిళ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో మోడరేట్ సక్సెస్ అందుకుంది.ఈ సినిమా తమిళ ఒరిజినల్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం డబ్బింగ్ వెర్షన్స్ తో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక రోజు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఒక మిస్టీరియస్ వ్యక్తి కాల్ చేస్తాడు. అతను భవిష్యత్‌లో జరిగే క్రైమ్స్ గురించి హింట్ ఇస్తాడు. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుంది, ఆపండని చెబుతాడు. మొదట పోలీసులు దాన్ని జోక్‌గా తీసుకుంటారు. కానీ మొదటి కాల్ తర్వాత అతను చెప్పినట్టే ఒక మర్డర్ జరుగుతుంది. దీంతో పోలీసులు షాక్ అవుతారు. మళ్ళీ మరో కాల్ వస్తుంది. ఇప్పుడు అదే వ్యక్తి ఒక అక్సిడెంట్ జరగబోతుందని, అది ఎక్కడ జరుగుతుందో లొకేషన్ కూడా చెప్తాడు. పోలీసులు ఆపడానికి ట్రై చేస్తారు కానీ లేట్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ అదిత్య తన టీమ్ తో ఈ మిస్టీరియస్ కాలర్‌ని ఐ‌డెంటిఫై చేయడానికి ఇన్వెస్టిగేట్ చేస్తారు.

Read Also : జాంబీలుగా మారే సైంటిస్ట్ ఫ్యామిలీ… ఊరు ఊరంతా వల్లకాడు … ఇదెక్కడి అరాచకం భయ్యా

Advertisement

కాలర్ హింట్స్ ప్రకారం అన్ని విక్టిమ్స్ ఒక కామన్ మ్యాన్ కలై అరసన్ కి కనెక్టెడ్ అని తెలుస్తుంది. కాలర్ ఐ‌డెంటిటీ ఇప్పుడు రివీల్ అవుతుంది. అతని పేరు దాస్, ఒక ఎలక్ట్రిషియన్. అతని కొడుకు కలై అరసన్ ఒక కేసులో హత్య చేయబడ్డాడు. దీనికి రివేంజ్ గా ఈ హత్యలు చేస్తున్నాడు. చివరికి దాస్ ని అదిత్య పట్టుకుంటాడా ? దాస్ కొడుకుని ఎందుకు చంపారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×