Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ అన్నాక ఫేవరెటిరిజం, గ్రూప్ గేమ్ అన్నది సర్వసాధారణం. కానీ ఫైనల్స్ లో ఆ పప్పులేమీ ఉడకవు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడిప్పుడే ఇమ్మూ, కళ్యాణ్ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతూ, మరింత క్లోజ్ అవుతున్నారు. అంతేకాదు డే 88 ఎపిసోడ్ లో ఇద్దరూ కలిసి రీతూని బలి పశువును చేశారు. అయినప్పటికీ రీతూ టాస్క్ లో దుమ్మురేపింది.
బ్యాలెన్స్ చేయరా డింభకా టాస్క్ జరిగే ముందు ఇందులో పాల్గొనాలి అనుకుంటున్న ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరో తేల్చుకోమని బిగ్ బాస్ ఆదేశించారు. అంతకు ముందే రేజ్ ర్యాంపేజ్ టాస్క్ లో కళ్యాణ్ తో ఓడి సుమన్ అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యాడు. అప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి డెమోన్, తనూజ, సంజన అవుటయిన వాళ్ళ రేసులో ఉన్నారు. ఇక మిగిలింది రీతూ, కళ్యాణ్, ఇమ్మూ, భరణి. ఈ నలుగురిలో చివరి వరకూ తామిద్దరూ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు కళ్యాణ్, ఇమ్మూ. భరణి స్ట్రాంగ్ కాబట్టి టాస్క్ లోకి లాగకుండా, రీతూని మధ్యలోకి లాగి బలి పశువును చేశారు.
పక్కా ప్లాన్ ప్రకారం రీతూతో బ్యాలెన్స్ చేయరా డింభకా టాస్క్ ఆడి ఓడిపోయారు ఇమ్మూ, కళ్యాణ్. ఇక అప్పుడు మిగిలేది భరణి. ఇప్పుడే ఇమ్మూ, కళ్యాణ్ తో ఆడింది కాబట్టి భరణిని సెలెక్ట్ చేసుకోక తప్పదు. అదే గనుక జరిగితే వీళ్ళిద్దరూ సేఫ్ గా చివరి వరకూ ఉంటారు. భరణి – రీతూ కొట్టుకుని ఒకరు ఓడిపోతే, మిగిలిన మరొకరితో పోటీ పడి ఈ ఇద్దరిలో ఒకరు ఫస్ట్ ఫైనాలిస్ట్ అవ్వొచ్చు అన్నది కళ్యాణ్, ఇమ్మూ మాస్టర్ ప్లాన్.
సాధారణంగా తోపు ఆటగాళ్లము అని చెప్పుకునే వాళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో ఫేస్ టు ఫేస్ తేల్చుకోవడానికి సిద్ధం అవుతారు. ఆడినా, ఓడినా అదే తమ బలం అంటూ వెన్నుచూపరు. కానీ ఇమ్మాన్యుయేల్ మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో ఆడడానికి, నామినేషన్స్ లోకి రావడానికి భయపడుతున్నాడు. ఆటలలో అతను అద్భుతంగా పోరాడి గెలుస్తున్నా కూడా వీక్ కంటెస్టెంట్స్ ను ముందు బయటకు పంపాలి అన్న స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. తాజాగా తనకు క్లోజ్ అయిన కళ్యాణ్ ది కూడా ఇదే పరిస్థితి. భరణి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను పక్కన పెట్టి, సుమన్ శెట్టితో ఆడాలని డిసైడ్ అయ్యాడు.
అయితే వీక్ కంటెస్టెంట్స్ ను ముందు అవుట్ ఆఫ్ రేసు చేయాలన్న వీళ్ళ ఆలోచన కూడా బాగానే పని చేసింది. అటు రీతూ, ఇటు భరణి ఇద్దరూ స్ట్రాంగ్. కాబట్టి వాళ్ళిద్దరూ కొట్టుకుని ఒకరు బయటకు వెళ్ళేలా ప్లాన్ చేశారు. ఇద్దరితో పోరాడటం కంటే ఒకరితో పోరాడడమే బెటర్ ప్లాన్ కదా మరి.
Read Also : ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి సుమన్ శెట్టి అవుట్… రీతూ వర్సెస్ భరణి… లాస్ట్ మినిట్లో తనూజ ట్విస్ట్