E-Paper
Advertisement

Sankranti Movies 2026 : మళ్లీ మొదలైన సంక్రాంతి సినిమాల సందడి..ఈ జోరు అదుర్స్!

Sankranti Movies 2026 : మళ్లీ మొదలైన సంక్రాంతి సినిమాల సందడి..ఈ జోరు అదుర్స్!
Advertisement

Sankranti Movies 2026 : ప్రతి ఏడాది జనవరి నెల ప్రారంభం అయింది అంటే చాలు సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి ఏకంగా ఐదు తెలుగు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా సందడి చేశాయి. జనవరి 9వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ), మారుతీ (Maruthi)దర్శకత్వంలో ‘ది రాజా సాబ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత జనవరి 12న చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఆల్ టైం రికార్డ్ హిట్ సొంతం చేసుకొని సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

సంక్రాంతి సినిమాల సందడి..

ఇక తర్వాత జనవరి 13న మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా వచ్చింది కానీ ఈ సినిమాను ప్రేక్షకుల పెద్దగా ఆదరించలేకపోయారు ఆ తర్వాత జనవరి 14న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి ముఖ్యంగా నారీ నారీ నడుమ మురారి సినిమా సంక్రాంతి హిట్గా నిలవాల్సి ఉంది కానీ సరైన థియేటర్లు పడక ఈ సినిమాకు కలెక్షన్లు కూడా రాలేదు. అలా మొత్తానికైతే ఈ ఐదు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి సందర్భంగా సందడి చేశాయి.

మళ్లీ మొదలైన సంక్రాంతి సినిమాల సందడి..

Advertisement

అయితే జనవరి నెల ముగిసింది.ఈ సంక్రాంతి సినిమాల సందడి మళ్లీ మొదలైంది అని చెప్పవచ్చు. అయితే ఈసారి థియేటర్లలో కాదు ఓటీటీలో.. ఈ ఐదు చిత్రాలు కూడా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఐదు చిత్రాలలో ముందుగా ఈ వారం రెండు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందులో మొదటిది ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ సినిమా జియో హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 6వ తేదీన స్ట్రీమింగ్ కి రానుంది.

ALSO READ:Prabhas: లవ్ స్టోరీపై తొలిసారి స్పందించిన ప్రభాస్.. ఎక్స్పెక్ట్ చేయలేదు!

థియేటర్లలో కాదు ఓటీటీలో..

Advertisement

అలాగే శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి రానుంది.ఇక అలాగే మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా ఫిబ్రవరి 11వ తేదీన జీ5 వేదికగా స్ట్రీమింగ్ కి రానున్నట్లు సమాచారం ఇలా ఈ మూడు చిత్రాలకు సంబంధించిన స్ట్రీమింగ్ డీటెయిల్స్ రాగా మిగిలిన రెండు చిత్రాల స్ట్రీమింగ్ డీటెయిల్స్ కూడా త్వరలోనే వెలువడనున్నాయి. ఏది ఏమైనా ఇప్పటివరకు ఈ ఐదు చిత్రాలు థియేటర్లలో పోటీపడుతూ సందడి చేయగా ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ ఫిబ్రవరి నెలలో సందడి చేయనున్నాయి. థియేటర్లలో పోటీపడ్డ ఈ సినిమాలు ఇప్పుడు ఓటీటీ లో కూడా పోటీ పడనున్నాయి.మరి ఈ చిత్రాలలో ఏ సినిమాకి మంచి టిఆర్పి రేటింగ్ లభిస్తుందో చూడాలి.

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×