E-Paper
Advertisement

Tharun Bhascker: ఆ విషయం వినగానే కుప్పకూలిపోయాను..తరుణ్ భాస్కర్ ఎమోషనల్!

Tharun Bhascker: ఆ విషయం వినగానే కుప్పకూలిపోయాను..తరుణ్ భాస్కర్ ఎమోషనల్!
Advertisement

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్న ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇటీవల తరుణ్ భాస్కర్(Tharun Bhascker) ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా పక్కన పెడితే తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ (ENE 2)పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ENE 2 నుంచి తప్పుకున్న సాయి సుశాంత్..

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులను జరుపుకోవడంతో ఈ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సీక్వెల్ సినిమాలో పార్ట్ 1 లో ఎవరైతే నటించారో వారందరూ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సినిమా నుంచి సాయి సుశాంత్ రెడ్డి (Sai Sushanth Reddy) తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో కార్తీక్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సాయి సుశాంత్ రెడ్డి తప్పుకున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు.

ఆ విషయం విని తట్టుకోలేకపోయాను..

Advertisement

ఇక ఈ విషయంపై సుశాంత్ రెడ్డి అధికారికంగా తెలియజేయడమే కాకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్ సైతం ఈ విషయం గురించి అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా స్పందించిన తరుణ్ భాస్కర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి సుశాంత్ రెడ్డి తప్పుకోవడం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. సుశాంత్ కు ఫోన్ చేసినప్పుడు తను ఈ సినిమాలో నటించడం లేదని చెప్పగానే ఒక్కసారిగా నేను కుప్పకూలిపోయానని ఆ సమయంలో చాలా కోపం వచ్చిందని తరుణ్ భాస్కర్ తెలిపారు.

సుశాంత్ పాత్రలో శ్రీకాంత్..

Advertisement

సుశాంత్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను తరుణ్ భాస్కర్ తెలియచేస్తూ.. సుశాంత్ ప్రస్తుతం తన తండ్రి వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నారని తరుణ్ భాస్కర్ తెలిపారు. సుశాంత్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది తన వ్యక్తిగత విషయమని, ఈ నిర్ణయాన్ని గౌరవించాల్సి వచ్చిందని తెలియజేశారు. ఇక ఈ సినిమా నుంచి సుశాంత్ తప్పుకున్న కార్తీక్ పాత్ర మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుందని, ఈ సినిమా ఎడిటింగ్ చేసే సమయంలో ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఇందులో కార్తీక్ పాత్రలో శ్రీకాంత్ కనిపించినప్పటికీ నాకు మాత్రం సుశాంత్ కనిపిస్తున్నారని తరుణ్ భాస్కర్ తెలిపారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ స్థానంలో కార్తీక్ పాత్రలో శ్రీకాంత్ మాగంటి నటించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాని కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: Dhurandhar 2 OTT:ఓటీటీ  పార్ట్నర్ ను మార్చేసిన ధురంధర్ 2 … ఈ సారి స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×