E-Paper
Advertisement

Prabhas: లవ్ స్టోరీపై తొలిసారి స్పందించిన ప్రభాస్.. ఎక్స్పెక్ట్ చేయలేదు!

Prabhas: లవ్ స్టోరీపై తొలిసారి స్పందించిన ప్రభాస్.. ఎక్స్పెక్ట్ చేయలేదు!
Advertisement

Prabhas: ప్రముఖ దిగ్గజ సినీ నటుడు కృష్ణంరాజు(Krishnam Raju) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ప్రభాస్ (Prabhas). వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తొలిసారి రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. అప్పటినుంచి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అటు టాలీవుడ్ లోనే కాకుండా ఇటు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా మార్కెట్ పెంచుకున్న ప్రభాస్.. ఇటీవల ‘ది రాజాసాబ్’ సినిమాతో ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో నటించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

లవ్ స్టోరీ పై ప్రభాస్ తొలిసారి స్పందన..

ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు యంగ్ హీరోల చిత్రాలకు సపోర్ట్ చేస్తూ బిజీగా మారారు. ఇదిలా ఉండగా కెరియర్ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న ప్రభాస్ అటు వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అభిమానులను నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ఈయన తొలిసారి లవ్ స్టోరీపై ఊహించని కామెంట్లు చేయడమే కాకుండా పోస్ట్ కూడా పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానులను ఆశ్చర్యపరిచేలా ప్రభాస్ చేసిన ఆ లవ్ స్టోరీ పోస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ALSO READ:Decoit: మళ్ళీ వాయిదా పడ్డ అడివి శేష్ డెకాయిట్.. కొత్త తేదీ ఎప్పుడంటే?

ఆకట్టుకుంటున్న కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్..

విషయంలోకి వెళ్తే.. యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shobhan) ఒక రిఫ్రెషింగ్ లవ్ స్టోరీతో ‘కపుల్ ఫ్రెండ్లీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్గా నటిస్తుండగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. చెన్నై నేపథ్యంలో సాగే ఈ కథలో బైక్ పూలింగ్ చేసే యువకుడిగా సంతోష్ , తన వ్యక్తిగత సమస్యల వల్ల ఇల్లు వదిలి వచ్చిన అమ్మాయిగా మానస వారణాసి కనిపించనున్నారు. ఇక వీరిద్దరి మధ్య కుదిరిన లివింగ్ రిలేషన్షిప్.. ఆ ప్రయాణంలో ఎదురయ్యే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు , సరదాలు ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..

మనసులో నుంచి పుట్టిన ప్రేమ కథ..

Advertisement

ఇకపోతే ఇద్దరూ కలిసి ఒకే రూమ్ షేర్ చేసుకోవడం.. ఫ్రెండ్స్ గా ఉన్న వీరు ప్రేమలో పడడం.. రిలేషన్షిప్ ను మెయింటైన్ చేయడం వంటి అంశాలను చాలా సహజంగా చూపించారు. యూత్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ తో ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాంటి ఈ ట్రైలర్ పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ట్రైలర్ ను ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ..” కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ మనసులో నుంచి నేరుగా వచ్చిన ప్రేమ కథలా కనిపిస్తోంది” అంటూ ఆయన రాసుకొచ్చారు. అంతేకాదు సంతోష్ శోభన్ తో పాటు కపుల్ ఫ్రెండ్లీ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

షాక్ లో నెటిజన్స్:

ఇది చూసిన కొంతమంది నెటిజన్లు షాక్ అవుతుంటే.. మరి కొంతమంది నీ సినిమాలను పక్కనపెట్టి పక్క చిత్రాలకు ప్రమోషన్స్ చేస్తున్నావ్.. నువ్వు సూపర్.. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంత మంది లవ్ స్టోరీ పై కామెంట్లు చేస్తునావు. మరి నువ్వేమైనా ప్రేమలో పడ్డావా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ ఎప్పుడు తన పెళ్లి గురించి ప్రకటిస్తారో చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉండడం గమనార్హం.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×