Horror Thriller OTT : ఓటీటీలో లెక్కలేనన్ని సినిమాలు అవైలబుల్ గా ఉన్నాయి. అయితే అందులో హారర్, సస్పెన్స్, కామెడీ వంటి అంశాలు లేకుండా ఒక్క సినిమా కూడా ఉండదేమో. జానర్ ఏదైనా మిగతా అంశాలు కూడా యాడ్ అయ్యే ఉంటాయి. కానీ అన్నీ జానర్లు కలిపి ఒకే సినిమాలో ఉండడం మాత్రం చాలా అరుదు. అయితే ఇప్పటికే ఓటీటీలో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్, హారర్, కామెడీ, అడ్వెంచర్… ఇలా అన్నీ కలిపి ఉన్న ఓ సినిమా అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది “దే విల్ కిల్ యు” మూవీ గురించే. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో వీక్షించొచ్చు ? అనే విషయం తెలుసుకుందాం పదండి.
హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిందే ‘దే విల్ కిల్ యు’ (They Will Kill You 2026 movie). మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ దుమ్మురేపుతోంది. విడుదలైన నెల తర్వాత అంటే ఏప్రిల్ 28 నుండి ఓటీటీలలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ‘దే విల్ కిల్ యు’ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఉచితంగా వీక్షించే ఛాన్స్ లేదు. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, యూట్యూబ్‌లో చూడవచ్చు. ఇందులో జాజీ బీట్జ్, ప్యాట్రిసియా ఆర్క్వెట్, మిహేలా, టామ్ ఫెల్టన్, హెదర్ గ్రాహం, ప్యాటర్సన్ జోసెఫ్ నటించారు. కిరిల్ సోకోలోవ్ దర్శకత్వం వహించారు. ఈ హారర్-థ్రిల్లర్‌కు IMDbలో 6.4 రేటింగ్ ఉండడం విశేషం.
జాజీ బీట్జ్ పోషించిన ఆసియా రీవ్స్ అనే పాత్ర చుట్టూ ఈ హారర్-థ్రిల్లర్ స్టోరీ నడుస్తుంది. ఆమె న్యూయార్క్ నగరంలోని ఒక ఎత్తైన, విలాసవంతమైన అపార్ట్‌మెంట్ భవనంలో ‘హౌస్ కీపర్’గా ఉద్యోగం చేస్తుంది. మొదట్లో అంతా సాఫీగానే సాగుతుంది. కానీ తరువాత ఆ భవనంలో ఏదో తేడా జరుగుతోందని ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే వారంతా వింతగా ప్రవర్తిస్తారు. అంతేకాదు అక్కడ పని చేసే సిబ్బంది అకస్మాత్తుగా మాయం అవుతారు.
Also Read : మిస్సయిన స్పేస్ షిప్ తీసుకొచ్చే దెయ్యం… నరకం నుంచి డైరెక్ట్ అటాక్
దీంతో హీరోయిన్ అసలు అలా అందరూ మిస్ అవ్వడం వెనకున్న సీక్రెట్ ఏంటో కనిపెట్టాలి అనుకుంటుంది. అదే సమయంలో ఒక భయంకరమైన నిజం బయట పడుతుంది. ఆ అపార్ట్‌మెంట్ నివసిస్తున్న వారంతా ఒక రహస్య మతపరమైన ముఠా (Cult)కి చెందిన వారని ఆమె కనిపెడుతుంది. తమ ఆచారం కోసం వాళ్ళు పని మనుషులను బలి ఇస్తున్నారని తెలుసుకుంటుంది. ఇక సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే, ఆ భవనంలో ఉన్నవారంతా హీరోయిన్ ను చంపడానికి ప్లాన్ చేస్తారు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ యువతి ఆ భవనం నుండి ఎలాగైనా బయట పడాలని ట్రై చేస్తుంది. కానీ అదొక చక్రవ్యూహంలాగా ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ ఆమెకు మనుషులు మాత్రమే కాదు, అతీంద్రియ శక్తులు కూడా కన్పిస్తుంటాయి. మరి ఆ క్రూరమైన గ్యాంగ్ నుంచి ఆమె ఎలా బయట పడింది ? అన్నది కథ.