E-Paper
Advertisement

కొత్త వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త.. కేవలం 24 గంటల్లో వాహనం రిజిస్ట్రేషన్, ఏపీలో కొత్త పద్దతి

కొత్త వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త.. కేవలం 24 గంటల్లో వాహనం రిజిస్ట్రేషన్,  ఏపీలో కొత్త పద్దతి
Advertisement

Amaravati: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. వాట్సాప్ ద్వారా పలు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ కేవలం 24 గంటల్లోనే పూర్తి చేయనుంది.

ఏపీలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త

Advertisement

వాహనాదారులు కొనుగోలు వినియోగాదారులు రిజిస్ట్రేషన్‌కు రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన రోజులు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ 24 గంటల్లోనే పూర్తి చేసేలా అడుగులు వేసింది. డీలర్ వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేయడం, ఆ తర్వాత రవాణా శాఖ అధికారులు ఆమోదం తెలిపేవారు. చివరగా శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండేది.

ఈ ప్రాసెస్ మొత్తానికి వినియోగదారులు రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడం, దానిపై చర్చించడం చకచకా జరిగిపోయింది. రిజిస్ట్రేషన్ విషయంలో ఆలస్యం కాకుండా వాహనదారులు వెంటనే రిజిస్ట్రేషన్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Advertisement

ఇకపై 24 గంటల్లో వాహనాల రిజిస్ట్రేషన్, వినియోగదారుల ఫుల్‌ఖుషీ

ఈ వారంలో ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. ఏపీ వ్యాప్తంగా దాదాపు 27 వేల వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్లు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌కు గడువు లేకపోవడంతో ప్రతీ రోజూ పెరుగుతూ వస్తోంది. కొత్తగా రానున్న రూల్స్ ప్రకారం.. రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కచ్చితంగా 24 గంటల్లో పూర్తి చేయాలి.

వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ డీలర్ చేసిన తర్వాత ఫ్యాన్సీ నంబరు కోరుకునే వాహనాల తప్పా మిగిలిన వాటి అప్లికేషన్లను అధికారులు పరిశీలించి 24 గంటల లోపు ఆమోదించాల్సి ఉంటుంది. శాశ్వత రిజిస్ట్రేషన్, అలాగే నెంబర్ జనరేట్‌ చేసే ప్రక్రియ నిర్ణీత గడువు లోపే పూర్తి చేయాలి.

ALSO READ: ఏపీకి ఎవ‌రుస్తున్నారో చెప్పుకోండి.. నారా లోకేష్ ఏఐ వీడియో వైరల్

ఒకవేళ అధికారులు 24 గంటల్లో ఆ ప్రక్రియ చేయకుండా జాప్యం చేసినా ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌కు ఆమోదం లభించనుంది. ఆన్‌లైన్‌లో అధికారులు సెలవురోజైనా ఆమోదించవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నమాట. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోపాటు శాశ్వత రిజిస్ట్రేషన్‌ అధికారాన్ని వాహన డీలర్‌కే అప్పగించాలని భావించారు.

ఈ విషయాన్ని అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ విధంగా చేస్తే న్యాయపరంగా చిక్కులు వస్తాయని రిజిస్ట్రేషన్‌ అధికారం రవాణా శాఖ వద్ద ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 24 గంటల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ రవాణా శాఖ. కొత్త విధానానికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వం ఆమోదించగానే అమల్లోకి రానుంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×