This week OTT Releases : మరో వారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి.. ఎందుకంటే ప్రతివారం సినీ ఇండస్ట్రీ నుంచి బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త సినిమాలు ఎక్కువగానే రాబోతున్నాయి.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ ఈవారం థియేటర్లలోకి రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగులో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై ‘లవ్ స్టోరీ’.. కాజల్ అగర్వాల్ నటించిన ‘ ద ఇండియా స్టోరీ’ తో సహా, హే చికితా, తో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ సినిమాలు మాత్రమే కాదు.. అటు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం చాలా చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలోకి దాదాపు 18 సినిమాలు రాబోతున్నాయి. నిజానికి పెద్దగా సూపర్ హిట్ సినిమాలు లేవు కానీ వస్తున్న అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.. పళ్లిచట్టంబి, కాన్ సిటీ, ముసాఫిర్ కేఫ్ వంటి సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు అటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటుగా హాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. మరి ఈ వారం ఏ ఓటీటీలోకి ఏ మూవీ రాబోతుందో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
ఎలైట్ ఫోర్స్ (వెబ్ సిరీస్ )- జులై 22
ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ – జులై 22),
రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్ )- జులై 23, ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) – జులై 23,
ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) – జులై 24
ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ మూవీ )-జులై 24 72 అవర్స్ (ఇంగ్లిష్ సినిమా )- జులై 24
లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) – జులై 24
కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జులై 24
ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – -జులై 24
పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ మూవీ) – జులై 24
బ్లీచ్ : థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) – జులై 25
స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జులై 24
అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) – జులై 24
ప్రేమ్ షాట్స్ (వెబ్ సిరీస్) – జులై 24
ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ )- జులై 24.
డింక్ (ఇంగ్లీష్ సినిమా) – జులై 24
సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) – జులై 24
గతవారంతో పోలిస్తే ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే లేవు కాని.. వెబ్ సిరీస్ మాత్రం ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. తెలుగు, తమిళం, హిందీ ఇలా 18 మూవీస్ అందుబాటులోకి రానున్నాయి.. పళ్లిచట్టంబి, కాన్ సిటీ సినిమాల కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే వచ్చేవారం స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయని తెలుస్తుంది.. ఈవారం థియేటర్లోకి రాబోతున్న సినిమాలలో విజయ్ దళపతి సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అంతే కాదు కిరణ్ అబ్బవరం కూడా ఏ మాత్రం తగ్గకుండా పోటీకి దిగుతున్నాడు.. మరి ఏ సినిమా విన్నర్గా నిలుస్తుందో చూడాలి…