E-Paper
Advertisement

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి
Advertisement

Galla Madhavi Vs Ambati: గుంటూరులో రెండు రోజుల కిందట ఓ మహిళ వివస్త్ర వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కష్టాలు రెట్టింపు అయినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబటిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

గుంటూరు మహిళ వివస్త్ర వ్యవహారం కొత్త మలుపు-గుంటూరులో రెండు రోజుల కిందట ఓ మహిళ వివస్త్ర ఘటన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలపై పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మీ నోటికి ఏది వస్తే  అది మాట్లాడటానికి పిచ్చివాళ్లు ఎవరూ లేరన్నారు.

Advertisement

అంబటిపై పరువు నష్టం దావా-మహిళ ఘటనకు సంబంధించి వీడియో ముందు వచ్చినట్లయితే, రెండు రోజుల తర్వాత పరామర్శకు ఎలా వెళ్లారని సూటిగా ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు ఎందుకు మాట్లాడలేదు? దీనిపై సమాధానం చెప్పాలని, విచారణ చేద్దామని అన్నారు. దొమ్మీలు, దౌర్జన్యాలు, గంజాయి నిందితులు, హత్యలు చేసినవారిని పరామర్శించడానికి వెళ్తారని దుమ్మెత్తిపోశారు.

అంబటిపై మండిపడిన ఎమ్మెల్యే గళ్లా మాధవి-దానికి కులాల మతాల పేరుతో రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అధినేత కారు కింద చనిపోయిన వ్యక్తిని ఇప్పటివరకు పరామర్శించిన సందర్భాలు లేవన్నారు. ఇదీ వైసీపీ రాజకీయ విధానమా అని తూర్పారబట్టారు. మహిళ ఘటనను రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

ఎలాంటి నిరూపణలు, ఆధారాలు లేకుండా తనపై చేసిన విమర్శలకు  పరువు నష్టం దావా వేస్తున్నట్లు కుండ బద్దలు కొట్టేశారు. మీరిచ్చిన కథనం, మాట్లాడిన విధానం ఆధారంగా కేసు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.  తాను ఇదంతా చేయించానని చెప్పడానికి మీ దగ్గరున్న ఆధారలేంటని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.

ALSO READ: భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

మా నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయిస్తున్నామని గుర్తు చేశారు. బాధితురాలి ఇంటికి పదే పదే వెళ్లి వాళ్ల వాయిస్ ఎందుకు అడుగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. అంబటి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని,  లేకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గళ్లా మాధవి.

ఈ ఘటనపై అంబటి రాంబాబు ఏమన్నారు? టీడీపీ వార్డు సభ్యుడు మూర్తిని కాపాడేందుకు స్థానిక ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 15న ఘటన జరిగితే కేసు ఆలస్యానికి కారణం ఎమ్మెల్యేనని విమర్శలు గుప్పించారు. బాధితులతో రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెల్సిందే.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×