E-Paper
Advertisement

Thriller Movie OTT : లవర్ తో ప్రైవేట్ కాల్ మాట్లాడుతూ తల్లికి దొరికపోయే అమ్మాయి… కట్ చేస్తే దిమాక్ కరాబ్ షాక్

Thriller Movie OTT : లవర్ తో ప్రైవేట్ కాల్ మాట్లాడుతూ తల్లికి దొరికపోయే అమ్మాయి… కట్ చేస్తే దిమాక్ కరాబ్ షాక్
Advertisement

Thriller Movie OTT : తలిదండ్రులు పిల్లలను ఎంతో కష్టపడి పెంచుతారు. ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ పిల్లలు పెద్ద అయ్యాక ప్రేమ పేరుతో కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఒంటరి అమ్మాయి కనబడితే వదలని దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళనుంచి ఒక తండ్రి తన కూతురును ఎలా కాపాడుకున్నాడనేదే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ. ఒక తండ్రి తన బిడ్డపై చూపే అంతులేని ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘బ్యూటీ’ (Beauty). వానరా సెల్యులాయిడ్స్‌, జీ స్టూడియోస్, మారుతి టీమ్‌ ప్రొడక్ట్‌ బ్యాన‌ర్స్‌పై అడిదాల విజయ్‌పాల్‌రెడ్డి, ఉమేశ్‌.కె.ఆర్‌.బన్సాల్‌ నిర్మించిన ఈ సినిమాకు జె.ఎస్.ఎస్.వర్ధన్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో అంకిత్ కొయ్య, నీలాక్షి పాత్ర, నరేష్, వాసుకి ఆనంద్ లీడ్ రోల్స్ లో నటించారు. 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా, 2 గంటల 19 నిమిషాలు నిడివి ఉంటుంది. ఈ చిత్రం 2026 జనవరి 2 నుండి ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆలేఖ్య (నీలాక్షి పాత్ర) ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ఆమె కాలేజీ విద్యార్థినిగా చదువుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు ఆమె తన ప్రియుడితో సీక్రెట్ గా మాట్లాడుతుంటే, తన తల్లి కంట్లో పడుతుంది. ఇక తల్లి మందలించడంతో తన ప్రియుడు అర్జున్ (అంకిత్ కొయ్య)తో కలిసి ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అనుకున్నట్లే ప్రియుడితో వెళ్ళిపోతుంది. ఇక తన కూతురు కనిపించకుండా పోవడంతో తండ్రి తీవ్ర ఆవేదనకు గురవుతాడు. కన్నకూతురిని వెతుక్కుంటూ అతను నగరంలోని చాలా ప్రాంతాల్లో తిరుగుతాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొనే చేదు అనుభవాలు, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే గాఢమైన అనుబంధాన్ని ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

మరోవైపు బయటి ప్రపంచంలో ఆలేఖ్య, అర్జున్ ఎదుర్కొనే పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. యువత తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే అంశాన్ని ఈ సినిమా ఆసక్తిగా చూపిస్తుంది. చివరికి ఆలేఖ్య తన తప్పును తెలుసుకుందా ? ఆ తండ్రి తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా మిగతా కథ.

Advertisement

Read Also :  ఇదేం సినిమారా సామీ… ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల్లోకీ వచ్చే ప్రొఫెసర్… క్షణక్షణం ఉత్కంఠ

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×