E-Paper
Advertisement

Thriller movie OTT: మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే

Thriller movie OTT: మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే
Advertisement

Thriller movie OTT : ఈ రోజుల్లో అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ వైపే చూస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని నచ్చిన కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా థ్రిల్లర్ కంటెంట్ తో కాలక్షేపం చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ల కోసం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బాగా సూట్ అవుతుంది. హాలీవుడ్ మూవీ కేవలం 90 నిమిషాల పాటు ఉంటుంది. కానీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఒక సైకో చేతిలో చిక్కుకొనే మహిళ చుట్టూ కథ ఉంటుంది. కిల్లర్ ఫాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డోంట్ మూవ్’ (Don’t Movie). 2024లో విడుదలైన ఈ సినిమాకి దీనిని ఆడమ్ షిండ్లర్ దర్శకత్వం వహించారు. ఇందులో కెల్సీ అస్‌బిల్లే, ఫిన్ విట్రాక్, మోరే ట్రెడ్‌వెల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. మీరు ఈ సినిమాను తెలుగు డబ్బింగ్‌లో కూడా చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఐరిస్ అనే ఒక మహిళ తన కొడుకు చనిపోయాడనే బాధలో ఉంటుంది. ఆమెకు జీవితం మీద విరక్తి పుట్టి, కొండ మీద నుంచి దూకి చనిపోదామని అడవికి వెళ్తుంది. అయితే అక్కడ రిచర్డ్ అనే ఒక వ్యక్తి ఆమెకు పరిచయమవుతాడు. ఆమెతో మాటలు కలిపి చావు నుంచి కూడా ఆపుతాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. అతను ఒక సీరియల్ కిల్లర్. ఆమెను కాపాడింది ఆమె ప్రాణాలు తీయడానికే అని కొద్దిసేపటికే అర్థమవుతుంది. రిచర్డ్ ఆమెకు ఒక వింత ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ మందు వల్ల కేవలం 20 నిమిషాల్లో ఆమె శరీరం మొత్తం పక్షవాతం వచ్చినట్టు అయిపోతుంది. ఐదు నిమిషాల్లో కాళ్లు వణికిపోతాయి. పది నిమిషాల్లో మాట పడిపోతుంది. చివరికి కనురెప్ప కూడా కదపలేని స్థితికి చేరుకుంటుంది.

ఇక ఆ మందు పూర్తిగా పనిచేయకముందే ఆమె ఆ కిల్లర్ నుంచి తప్పించుకుని పారిపోవాలి. కదలలేని స్థితిలో ఉన్న ఐరిస్, రిచర్డ్ బారి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా ఉత్కంఠగా ఉంటాయి. దారిలో ఆమెకు కొందరు వ్యక్తులు ఎదురైనా, రిచర్డ్ తన మాటలతో వాళ్లను కూడా ఎలా బురిడీ కొట్టిస్తాడు. చివరికి ఐరిస్ తన ప్రాణాలను కాపాడుకుందా ? ఆ కిల్లర్ చేతిలో బలైపోతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : జెన్నిఫర్ లోపెజ్ నటించిన మ్యూజికల్ డ్రామా ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Tags

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×