E-Paper
Advertisement

Kiss of the Spider Woman OTT : జెన్నిఫర్ లోపెజ్ నటించిన మ్యూజికల్ డ్రామా ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

Kiss of the Spider Woman OTT : జెన్నిఫర్ లోపెజ్ నటించిన మ్యూజికల్ డ్రామా ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Kiss of the Spider Woman OTT  : ఓటీటీలోకి ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్న హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది. ఈ సినిమా గతంలో ‘డ్రీమ్‌గర్ల్స్’, ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ వంటి సూపర్ హిట్ మ్యూజికల్ సినిమాలను తీసిన బిల్ కాండన్ తెరకెక్కించారు. అందుకే ఇందులో మ్యూజిక్ సీక్వెన్స్‌లు చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ఇందులో జెన్నిఫర్ లోపెజ్ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తుంది. సినిమా స్టార్‌గా, స్పైడర్ ఉమెన్‌గా, ఫ్రెంచ్ గూఢచారిగా ఇందులో ఆమె నటన హైలైట్‌గా ఉంటుంది. 1983 కాలం నాటి అర్జెంటీనా జైలు నేపథ్యంలో సాగే కథ ఇది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ అమెరికన్ మ్యూజికల్ డ్రామా మూవీ పేరు ‘కిస్ ఆఫ్ ది స్పైడర్ ఉమెన్’. దీనినకి ఆస్కార్ విజేత బిల్ కాండన్ దర్శకత్వం వహించారు. ఇది మాన్యుయెల్ పుయిగ్ 1976 నవల ఆధారంగా రూపొందింది. ఇందులో డియెగో లూనా, టోనాటియు, జెన్నిఫర్ లోపెజ్ నటించారు. విడుదల: ఈ చిత్రం 2025 జనవరి 26న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారి ప్రదర్శించబడింది. ఆ తరువాత అమెరికా థియేటర్లలో 2025 అక్టోబర్ 10న విడుదలైంది. ఈ సినిమా 2026 మార్చి 6 నుండి Lionsgate Play లో స్ట్రీమింగ్ కానుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా 1983లో అర్జెంటీనాలో ఉన్న ఒక జైలు గదిలో జరుగుతుంది. అక్కడ ఇద్దరు ఖైదీలు ఉంటారు. ఒకరు మోలినా, ఇతను చాలా సున్నితంగా ఉంటాడు. ఊహల్లో బతికేస్తుంటాడు. రెండో వ్యక్తి వాలెంటిన్, ఇతను ఒక సీరియస్ విప్లవకారుడు. సమాజం మారాలని పోరాడే మొండి ఘటం. అయితే జైలు గది అంటేనే నరకం కదా? అక్కడ అధికారులు పెట్టే టార్చర్, ఆ చీకటి, ఆ ఒంటరితనాన్ని భరించడం వాలెంటిన్‌కు చాలా కష్టమైపోతుంది. అప్పుడు మోలినా తన ఊహలతో వాలెంటిన్‌కు సాయం చేయాలనుకుంటాడు. తను చూసిన సినిమాల గురించి కథలు కథలుగా చెప్పడం మొదలుపెడతాడు. ఆ కథల్లో మెయిన్ క్యారెక్టరే స్పైడర్ ఉమెన్ (జెన్నిఫర్ లోపెజ్). మోలినా ఆ కథను ఎంత బాగా చెప్తాడంటే.. వాలెంటిన్ తనకున్న గాయాలను, ఆకలిని కూడా మర్చిపోయి ఆ సినిమాలో లీనమైపోతాడు.

ఇక ఆ కథలు చెప్పేటప్పుడు జైలు గది కాస్తా కలర్ ఫుల్ మ్యూజికల్ సెట్‌గా మారిపోతుంది. అందులో జెన్నిఫర్ లోపెజ్ గ్లామర్, పాటలు, డాన్సులు చూస్తుంటే వాలెంటిన్‌కు ఏదో ఒక తెలియని రిలీఫ్ దొరుకుతుంది. నిజానికి మొదట్లో వాలెంటిన్‌కు మోలినా అంటే అస్సలు పడదు. కానీ మోలినా ఓపికతో వాలెంటిన్ మనసు గెలుచుకుంటాడు. చివరికి జైలు అధికారులు వాలెంటిన్ దగ్గర ఉన్న సీక్రెట్స్ తెలుసుకోవడానికి మోలినాను బ్లాక్ మెయిల్ చేస్తారు. అయితే మోలినా మాత్రం స్నేహితుడిని అస్సలు మోసం చేయడు. ఒక్క మాటలో ఈ సినిమా గిరించి చెప్పాలంటే, కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుని అండ ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందనేది ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు.

Advertisement

Read Also : పిచ్చి ప్రేమతో పెళ్లి వరకు… విడాకులతో ఊహించని మలుపు… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్టోరీ

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×